UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 3 June 2015

రివ్యూ: పండగ చేస్కో
బ్యానర్: యునైటెడ్ మూవీస్ 
నటీనటులు: రామ్, రకుల్ ప్రీతి సింగ్, సోనాల్ చౌహన్, సాయికుమార్, రావు రమేష్, బ్రహ్మానందం,జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, ఎమ్మెస్ నారాయణ, సురేఖా వాణీ, ప్రియ, తదితరులు
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాత: పరుచూరి కిరీటి 
కథ: వెలిగొండ శ్రీనివాస్
మాటలు: కోన వెంకట్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
విడుదల తేదీ: 29 మే, 2015

కథ: 
ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా సినిమాలతో ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ కొట్టిన రామ్ ఎనర్జీ కూడదీసుకొని చేసిన సినిమా పండుగ చేస్కో. వేసవి సినిమాలు చిరాకు పెడుతున్న టైం రిలీజ్ అయిన పండగచేస్కో  విడుదలకుముందే పడాల్సిన ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేసింది. మరి ఫలితం అయినా ఆనందాన్నిస్తుందా..? లేక రామ్ కి మరో హ్యాట్రిక్ ని మొదలెట్టబోతుందా..?
అనగనగా ఒక మెరుపులాంటి కుర్రాడు అతని పేరు కార్తిక్(రామ్) వయస్సుకు మించిన అనుభవం, క్వాలిఫికేషన్ కి అందని అందలం అతని సొంతం. ప్రతిదీ లాభం నష్టం కేటగిరీ లో చూసే కార్తిక్ తనకంటే రెండాకులు ఎక్కువ చదివిన స్వీటీతో పెళ్లికి రెడీ అవుతాడు. ఎంగేజ్ మెంట్  తర్వాత ఇండియాలో తన ఫ్యాక్టరీ ప్రాబ్లమ్స్ లో ఉందని ఇండియాకి వస్తాడు.  ఆ ప్రాబ్లమ్ కి కారణం దివ్య(రకుల్ ప్రీతి సింగ్ ) అని తెలుసుకొని తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి దివ్యను ప్రేమ ట్రాక్ ఎక్కించాలనుకుంటాడు. ఇంతలో కొందరు దివ్యను కిడ్సాప్ చేస్తారు. అసలు కార్తిక్ ఇండియా్ వచ్చిందే దివ్యకోసం అని తర్వాత తెలుస్తుంది. తన ఫ్యామిలీ తో  కార్తిక్ కి అనుబంధం ఉంటుంది. అదేంటి...? ఎంగేజ్ మెంట్ తర్వాత దివ్యకోసం ఎందుకు ఇండియాకి వచ్చాడు.  దివ్యకుటుంబం కు తన కుటుంబం ఎందుకు దూరమైంది అనేది మిగిలిన కథ..

విశ్లేషణ: 
ఈ ఫార్మెట్ కథలకు సాట్యురేషన్ పాయింట్ వచ్చినా ఇంకా లౌక్యం చూపిస్తూ అదే కధకు కొత్త ట్రీటెమెంట్ రాసుకొని ఇండస్ట్రీ లో పండుగ చేస్కుంటున్న కోన వెంకట్, గోపీమోహన్ జంట తెలివితేటలకు ఆశ్చర్యపోవాల్సిందే. విడిపోయిన కుటుంబం.. కలపాలనుకున్న కొడుకు.. ఆ లక్ష్యం కోసం తన ఉనికిని దాచుకొని కొత్త  పాత్రలో వారింట్లో చేరతాడు.. తన లౌక్యంతో ఆ ఇంట్లో వారందరినీ మార్చుతాడు.. కొందరిని ఇరికిస్తాడు. మరికొందరిని బతికిస్తాడు. కొందరిని 
ఆడుకుంటాడు...మరికొందరిని వాడుకుంటాడు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ తో ప్రతి సీజన్ లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంది. అరిగిపోయిన బ్రహ్మానందం ట్రాక్ నుండి విసిగిపోయిన హీరో ట్రాక్ వరకూ అన్నీ పాతచింతకాయ పచ్చడే. ఇలా అయితేనే ప్రేక్షకులు నవ్వుతారని ఫిక్స్ అయి కొత్త ఐడియాస్ ని నమ్ముకునే ధైర్యంలేని  పిరికి రచయితలు సృష్టించిన పాత్రలు తెరకు, ప్రేక్షకులకు పాతవే. ఇంత చూసాక కొత్తదనం ఏంటని అడిగే ధైర్యం ఎలాగూ ఉండదు. రోటీన్ గా అనిపించే మ్యూజిక్ నుండి దాని డామినేట్ చేసే క్లైమాక్స్ వరకూ ఫార్మెట్ ని సిన్సియర్ గా ఫాలో అయ్యాయి. ఇక నవ్వడం.. నవ్వకపోవడం ప్రేక్షకుల ఇష్టం. నవ్వించడమే సినిమాల పరమావధి అయితే ఆ పాత్రలు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ చక్కగా ఆ పాత్ర పోషిస్తున్నాయి. ఇక కామెడీ పేరుతో ఎమ్మెస్ క్యారెక్టర్ తో దర్శకుడు పండించిన బూతు ఫ్యామిలీతో సినిమాలకు వెళ్లిన ప్రేక్షకులు సిగ్గుపడేలా చేస్తుంది. ఇంత చవకబారు కామెడీని రామ్ సినిమాలో ఊహించలేం. ఇక బలిష్టింగా కనపడే బుర్రతక్కువ విలన్లు కూడా కొత్తేమీ కాదు. ఇలా పండగచేస్కో సినిమా అంతా విసిగించే బోరింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక ఉన్నంతలో రకుల్ లుక్ బాగుంది. సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత కాస్త టెంప్టింగ్ పాయింట్ గా నిలిచింది. కన్ ఫ్యూజన్ డ్రామాకి నవ్వగలిగే ఓపిక మీకుంటే పండగచేస్కో మిమ్మల్ని అక్కడక్కడా నవ్విస్తుంది.  ఇక వెన్నెల కిషోర్ ట్రాక్ దూసుకెళ్తా....నుండి ఎత్తుకొస్తే.. ఎమ్మెస్ ట్రాక్ బృందావనం నుండి దింపేసారు.. ఇక క్లైమాక్స్ లో అత్తారింటికి దారేది టైప్ లో ఎమోషన్ పండించడానికి ట్రైచేసిన రామ్.. రోటీన్ తప్ప తనకు మరో ఆప్సన్ లేదని తేల్చేసాడు.. నవ్విన జోక్ లకే నవ్వే ఓపిన ప్రేక్షకులకు ఉన్నంతకాలం ఇలాంటి పండగ చేస్కోలు వస్తూనే ఉంటాయి. కొత్తగా ట్రై చస్తే నవ్వుతారో.. లేదో అన్న భయంతో అలవాటయిన కామెడీనే బాగా అలవాటయిన కథలో ఇరికించి నవ్వించేందుకు ప్రయత్నించింది పండుగ చేస్కో టీం. ఇక నవ్వడం నవ్వకపోవడం మీ ఇష్టం.. ఈ సినిమా పండగ చేస్కో కాదు...టైం....మనీ దండగ చేస్కో...అని చెప్పవచ్చు. 
- See more at: http://tv5news.in/NewsDetails.aspx?ID=17221&SID=33&Title=PAMDAGA%20CHESKO%20RIVEW#sthash.L7pW0NAh.dpuf

No comments:

Post a Comment