.......శ్రీ శ్రీనివాసం...శ్రీ వెంకటేశం.......
!! బ్రహ్మోత్సవాలు నేటినుండి ప్రారంభం !!
"బ్రహ్మదేవుడు జరిపే ఉత్సవాలు"
!! తిరువీధుల మెరసే దేవదేవుడు! గరిమల మించిన సింగారముల తోడను తిరుదండెల పైనేగి దేవదేవుడిదే తొలినాడు! సిరుల రెండవనాడు! శేషుడి మీద మురిసేన మూడొనాడు ముత్యాల పందిరి క్రింద!!
అంటూ... దేవదేవుడి బ్రహ్మాత్సవ వైభవాన్నీ శ్రీనివాసుడి వాహన సేవలనూ పదకవితా పితామహుడైన అన్నమాచార్యులు వారు కీర్తించారు...
అంటూ... దేవదేవుడి బ్రహ్మాత్సవ వైభవాన్నీ శ్రీనివాసుడి వాహన సేవలనూ పదకవితా పితామహుడైన అన్నమాచార్యులు వారు కీర్తించారు...
👉 సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తనను సృష్టించిన ఆదిదేవుడుకి కృతఙ్ఞతలను తెలుపుతూ... తాను సృష్టించిన ఈ చరా చర ప్రపంచానికి ఏ విధమైన కష్టనష్టాలు రాకుండా... కాపాడమని వేడుకుంటూ... ఉత్సవాలను ప్రారంభించి... ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వున్నట్లు పురాణ కథనం... బ్రహ్మదేవుడు జరిపే ఉత్సవాలు కనుక..."బ్రహ్మోత్సవాలు" అని పేరు...
👉 బ్రహ్మోత్సవాల సమయంలొ వాహనసేవల్లొ... ముందువైపు బ్రహ్మరథం వెడుతూ వుంటుంది... ఈ రథంలొ నిర్గుణరూపంలొ బ్రహ్మదేవుడు వుండి ఉత్సవాలను నిర్వహింపజేస్తూ వుంటాడు... అయితే రథొత్సవంనాడు మాత్రం బ్రహ్మరథం వుండదు... ఆ రొజు బ్రహ్మదేవుడు స్వయంగా రథాన్నీ లాగుతూ ఉంటాడని కథనం....
.......ఓం నమో వెంకటేశ........










No comments:
Post a Comment