......జై వీరాంజనేయ......
" రామముద్రికని స్వీకరించిన సీతమ్మ "
👉 వానరా..! నీవు పలికిన రామకథ జగద్విఖాతము... లెక్కకు అసాధ్యమైనన్ని శివాలయములున్న ఈ లంకలొ కూడా... రామజపం చేసేవారు ముగ్గురున్నారు... విభీషనుడు... అతని సొదరి త్రిజట... అతని పుత్రిక అనల... వీరు లంకాధిపతి బందువులైనందున... రామనామ జపము చేసే వీరిని అతడు దండించలేక పొతున్నాడు... లంకలొనే ఇంతగా ప్రచారంలొ నున్న... రామకథ చెప్పినంత మాత్రానా... నిన్ను నేనెలా విశ్వశించగలను మునుపు సన్యాసిలా "మాయవేషం"లొ వచ్చిన వాడే... మళ్లీ నన్నుమోసగించడానికి... ఈ "వానర" వేషంలొ రాలేదు గదా... అయ్యో... ప్రాణనాథా... రామచంద్రా... ఏమిటి నీకీ పరిక్ష...? అంటూ దు:ఖిస్తూ వాపొయింది సీతమ్మ...
👉 కాదమ్మాకాదు... హనుమ కంగారు పడుతూ... నేను మోసగాడిని కాదు... నా పేరు హనుమ... అంజనీదేవి నా తల్లి... వాయుపుత్రుడను... ధిక్పాలకాధిపతి దేవేంద్రుడు నాకు "ఇచ్చారూపధారణ" వరాన్నీ అనుగ్రహించాడు... బ్రహ్మదేవుడు నాకు చిరంజీవిత్వాన్నీ అనుగ్రహించాడు... శ్రీరామచంద్రుని ఆఙ్ఞాపాలన నిమిత్తం నేను ఈ లంకకి వచ్చాను తల్లీ... నేను వానరుడను... రామబంటును... శ్రీరామ సందేశాన్నీ తీసుకొచ్చిన వాడిని నన్ను నమ్ము అని అన్నాడు హనుమ అనునయంగా...
👉 అంతేకాదు సీతాదేవి కొరిక మీదట... శ్రీరాముని రూపురేఖా విలాసాలను లక్ష్మణుని రూపురేఖాదులను వివరించాడు... అంతేకాదు అప్పటివరకు తన నొటిలొ భద్రపరచుకున్న శ్రీరామ నామాంకిత అంగుళీయకాన్ని బైటికి తీసి... ఓ మహాభాగ్యశాలి... ధీమంతుడైన ఆ శ్రీరామచంద్రప్రభువు యొక్క ధూతని నేనని మీకు నమ్మకం కలిగించడానికి మనప్రభువు నీకు ఇమ్మని పలుకుతూ నాకిచ్చిన ఈ రామ ముద్రికని స్వీకరించు తల్లీ... మంచుతెరలు తొలగిన సూర్యభింబంవలే నీ అనుమానాలన్నీ తొలగి... నీ మనస్సు శాంతి సౌభాగ్యానందాలతొ ప్రకాశిస్తుంది.. అని పలికి రామముద్రికని సీత దోసిట్లొ సమర్పించాడు హనుమ... శ్రీరామ హస్తభూషణమైన ఆ అంగుళీయకాన్ని చూడగానే సీతమ్మ నేత్రాల్లొ ఆనందభాస్పాలు గిర్రున తిరిగాయి... భక్తి పురస్కరంగా అంగుళీయకాన్ని కన్నుల కద్దుకొంది....
.......జై వీరాంజనేయ......






No comments:
Post a Comment