భగవద్గీత
75
75
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26 ||
జ్ఞానులు ప్రతిఫలా సక్తులైన అజ్ఞానుల బుద్ధిని కదలించరాదు. తన ధర్మాచరణమును చూచి వారు ఉత్తేజితులయే విధముగా ప్రవర్తించవలెను. అప్పుడు తన కర్మాచరణము వారును అనుకరించెదరు. ఇది కొందరు తమకు విషయములన్నీ తెలియునని భావించే గురువులకు ఉద్దేశింపబడినది. అజ్ఞానులకు ధర్మ బోధ చేయ రాదు. "మీరు అజ్ఞానులు, నా మార్గము అనుసరించండి" అనిప్రవచనములు చేయరాదు. తాను లోక సంగ్రహార్థము చేసే కర్మను చేయుచూ వారికి ఆదర్శముగా నిలువవలెను. వారికి జ్ఞానబోధకాకుండా సత్కర్మాచరణమందు నిష్ఠ కలిగించవలెను. కర్మలు బాగుగా చేయునట్లు చేయవలెను.
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment