"జ్ఞాపకాల దొంతరలు ."
వరిగడ్డి వాము చాటున దాగి ఆడిన దాగుడుమూతలు....
గొడ్లచావిడి దగ్గర గూట్లో దాచిన గోల్డ్ స్పాట్ మూతలు ...
వీధి చివర పాచిపట్టిన గోడ మాటున ఆడిన గోళి ఆటలు...
వీధి మధ్యలో సాగిన గోడుం బిళ్ళ ,తొక్కుడు బిళ్ళలు ....
తోటి వారి తొండి ఆటతో జరిగిన తోపులాటలు ...!

అందరమూ కలిసి దొడ్లో ఆడిన అమ్మ,నాన్నలా బొమ్మలాటలు ....
అమ్మ అడిగిన పచారి సరుకుకు, నేను తొక్కిన సైకిల్ పక్క తొక్కుడు...
కోమటి కొట్లో మిగిలిన చిల్లరకు నేను కొన్న పిప్పరమెంటు బిళ్ళలు...
పీరు సాయిబు రోజు అమ్మే పప్పుచెక్క , పీచు మిఠాయీలు ...
వాటి కోసం నేను వెతికే పాతసామాను,విరిగిపోయిన ఇనుప ముక్కలు...
పండగకు వండిన పిండివంటలు,అన్నదమ్ములు తొడుక్కున్న ఒకే రకపు కొత్త బట్టలు...!!

స్కూల్ బ్యాగు -లాగు జేబిలో కూరిన జంతికలు గురుతులు...
స్కూల్ డ్రెస్ ఫై పడిన బాల్ పెన్ మరకలు,లాగు జేబుకి వదలని నునె మరకలు...
తోటి పిల్లలతో చేసిన అల్లరికి మాస్టారు విరగోట్టిన రూల కర్రలు...
ఏటి గట్టున జతగాళ్ళతో కూడి పంచుకొన్న ఊరి సంగతులు ......
ప్రతి ఏడు ఊరిలో జరిగే రామనవమి,దశరా, గంగానమ్మ జాతరలు...!!!

సంక్రాంతి పండుగకి దొంగలించి తెచ్చిన వంటచెరుకుతో వేసిన భోగి మంటలు....
రామచంద్ర టాకీస్‌లో మొదటి ఆటకి తెరముందు వేలాడే ఇనుప గోలుసుల ఫై ఊగిన ఊయల ఆటలు..
అభిమాన హీరో ఆటకి విసరిన పూల రేకులు మరుయు చిల్లర పైసలు ....
కాల్వ గట్టున పాత గుడ్డతో పట్టిన మట్టగుడిసెలు, బురద మట్టలు . ....
రేడియోలో వచ్చిన పాత పాటలు, పక్కింట్లో చూసిన పౌరాణిక సీరియళ్ళు....
మనం చేసిన బాల్యపు గురుతులు, మరచిపోలేని మధురమైన స్మృతులు ....!!!!

జ్ఞాపకాల దొంతరలు గురుతుకొచ్చినప్పుడల్లా,
మనసులో మెదలాడినప్పుడల్లా ఏదో తెలియని వెలితి, తీయని బాధ...
మనషిగా పుట్టించి మాలో ఇన్ని భావాలకి మూలకారణం ఐన--
నీకు తల వొంచి ప్రణమిల్లటములో తప్పేముంది ఈశ్వరా!!!!"

---------------------------------
మహరాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment