అనాధే.........
ప్రకృతి ఒడిలో సేద తీరని ఏ జీవైనా ... అమ్మ ప్రేమని పొందలేని ఏ వయసైనా ... కల్మషాల మనసులేని ఏ మనిషైనా ... కడగండ్లు లేని ఏ కన్నీరైనా.... ఓదార్పులేని ఏ మనసైనా ..... నటనలు నేర్చిన ఏ బ్రతుకైనా ... మానవత్వంలేని ఏ మృగమైనా .... ప్రేమతనం చూపని ఏ బంధమైనా .. ఓర్పు లేని ఏ క్షణమైనా ... కనికరం లేని ఏ రుణమైన .... తన కడుపే చూసే ఏ ఆకలైనా ... మచ్చపడనీయని ఏ మాటైనా .... గొంతులోనే మిగిలే ఏ జ్ఞాపకమైనా .... తడిలేని ఏ స్పర్శైనా ... సడిలేని ఏ విరహమైనా ... గడివేయలేని ఏ ప్రశ్ననైనా ... పైకి ఉబకలేని ఏ రసమైనా ... నాట్యమాడలేని ఏ తలపైనా .... పైకి చెప్పలేని ఏ గురుతైనా ... వెంటపడలేని ఏ వెలుగైనా ..... జంటగా కనపడే ఒంటరి ఇరకాటమైన..... పంచుకోలేని ఏ భావమైనా ... తెంచుకోలేని ఏ బంధనమైనా .... చిగురు తొడగని ఏ కొమ్మైనా ... మెరుగుపడని ఏ ఆలోచనైనా .. అనాధగా మిగిలేవారెందరో .............ఒంటరిగా గడిపే గాధలెన్నో . |
one of the song expressed through me in 2003 and happened in the material world in 2007
MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU
DIRECTORATE OF KING AND QUEEN
HYDERABAD
No comments:
Post a Comment