UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 13 September 2015



రాజధాని స్థాయి నగరంగా విజయవాడ
• సుందరీకరణపై ముఖ్యమంత్రి సమీక్ష
• నగరంలో 14 రహదారులకు రూ.96.32 కోట్లు
• ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, గ్రీనరీ, వీధిదీపాల పనులు వేగవంతం
విజయవాడ: విజయవాడ నగరాన్ని సుందరీకరణతో రాజధాని స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆదివారం ఇక్కడ తన నివాసంలో అధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరంలో 40.63 కిలోమీటర్లుగా వున్న మొత్తం 14 రహదారుల నిర్వహణను రూ.96.32 కోట్లతో అత్యుత్తమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్షణమే నగరంలోని రహదారులు, పౌరసౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు.
రాజధాని అరావతి నగర నిర్మాణం పూర్తయ్యేదాకా విజయవాడ నుంచే పరిపాలన సాగుతుందని, అందువల్ల ఉన్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, పౌరులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, మెరుగైన సదుపాయాలు సమకూర్చాలని కోరారు. పాదచారుల బాటలు, డివైడర్లు, గ్రీనరీ, వీధి దీపాలు, ట్రాన్సుకో వైరింగ్ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. నగరంలో 7.5 కిలోమీటర్ల మేర కృష్ణానదీ తీరం వెంబడి వున్న కాల్వ గట్లపై ఆక్రమణలు లేకుండా, ఆహ్లాద వాతావరణం ఏర్పడేలా సుందరీకరణ చేపట్టాలని కోరారు.
భారీ వర్షాల క్రమంలో మురుగు నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సీనరేజ్, వాటర్ ట్రీట్‌మెంట్ విషయంలో ఆధునిక పద్ధతులను అనుసరించాలని కోరారు. మురుగునీరు మంచినీటిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగర రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా చూసుకోవాలని, నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. నగరంలోని 54 ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర సెన్సర్ డ్రివెన్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్న పోలీస్ శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదించారు. రోడ్ డివైడర్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు. త్వరలో నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడ ఎలాంటి తేడా వచ్చినా ఉపేక్షించబోనన సీఎం స్పష్టం చేశారు. మునిసిపల్ కార్పోరేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను వినియోగించుకుని వెంటనే ప్రణాళికల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట అదనపు నిధులు ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
ఇప్పటికే నిర్మాణంలో వున్న 2 నైట్ షెల్టర్లకు అదనంగా మరో 4 షెల్టర్లను ఏర్పాటుచేసి వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలని, ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారు. విజయవాడలో వున్న అన్ని పార్కులను, కమ్యూనిటీ హాళ్లను ఆధునీకరించాలని, అదనపు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ, మునిసిపల్,ఎలక్ర్టిసిటీ, వాటర్, ఇతర శాఖలన్నీ సమన్వయం చేసుకుని విజయవాడ నగరాన్ని నిర్ణిత కాలవ్యవధిలో రాజధాని స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇదిలావుంటే బ్యూటిఫికేషన్ కోసం ఇప్పటికే బ్లూ అండ్ గ్రీన్ అంతర్జాతీయ సంస్థకు ప్రణాళిక తయారీ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది.
సమీక్షా సమావేశంలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వల్లన్, జిల్లా కలెక్టర్ బాబు, సీఆర్ డీఏ కమిషనర్ శ్రీ నాగులాపల్లి శ్రీకాంత్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర, మునిసిపల్ కమిషనర్ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment