నేటి తరం యువతకు నాటి స్వాతంత్రోద్యోమ నాయకుల త్యాగాల గురించి తెలియకపోవడం , వారు ఏ ఆశయం కోసమైతే తమ జీవితాలను త్యాగం చేశారో తెలిపేందుకు సరియైన పాఠ్యంశాలు లేకపోవడం మూలంగా సరియైన లక్ష్యం, గమ్యం లేకుండా కేవలం వారి చుట్టూ ఉన్న గ్లామర్ ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఎలాంటి లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఈనాడు యువతను తాము చదువుతున్న చదువు కంటే కూడా సినిమాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు ప్రేమ పేరుతో తీస్తున్న సినిమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చట్టాలు పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అబ్బాయిలకు 21 సంవత్సరాలు, అమ్మాయిలకు 18 సంవత్సరాలు అని నిర్ణయించాయి కానీ అంతకంటే చిన్న పిల్లలతో ప్రేమ నేపథ్యంతో సినిమాలు తీస్తుంటే వాళ్ళను ఏ చట్టాలు శిక్షించలేకపోతున్నాయి. చిత్రం, టెంత్‌క్లాస్, ప్రేమిస్తే, కొత్తబంగారు లోకం వంటి సినిమాలు చిన్నపిల్లలతో తీస్తూ విద్యార్థులను యువతను తప్పదారి పట్టిస్తున్నారు. ఈ సినిమాల ప్రభావానికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మొన్న ఖమ్మం జిల్లాలో 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల షేక్ రేష్మా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతున్న 15ఏళ్ళ షేక్ నాగుల్‌మీరాను ప్రేమించానని, తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సెల్‌టవర్ ఎక్కి చనిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రేమంటే ఏంటో కూడా తెలియని పసి వయసులో విద్యార్థులు ప్రేమ పేరుతో చేస్తున్న వికృత చేష్టలు, దాడులను చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. ఒక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సినిమా హాల్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ప్రతి రోజు 6 లక్షల మంది యువత సినిమాలు చూస్తారని ఆ సర్వే పేర్కోంది. ఈ సర్వే భయాందోళన కలిగించే వివరాలను తెలిపింది. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన 1991 నుండి నేటివరకు విడుదలవుతున్న సినిమాల్లో అత్యధికం ప్రేమపేరుతో వస్తున్న సినిమాలే వుంటున్నాయి. మన తెలుగు సినిమా ఇండ్రస్ట్రీట్‌లో మొత్తం వంద సినిమాలు విడుదలైతే అందులో దాదాపు 60 శాతం సినిమాలు 'ప్రేమ' ఇతివృత్తంగా, 20 శాతం సినిమాలు అస్లీలం, క్రైమ్ నేపథ్యంలో వస్తున్నాయని ఆ సర్వే తేల్చింది. ఇన్ని సినిమాలు యువతకు ప్రేమే జీవితం అని భోదిస్తూంటే, ప్రేమలేకుంటే లైఫ్ వేస్ట్ ఆంటూ యువత చెవుల్లో నిరంతరం మారుమ్రోగుతుంటే యువతను ఏ ఉద్యమాలు ఆకర్షించుకోగలుగుతాయి? ఏ ఆశయం వైపు మళ్లిస్తాయి?. ఇన్ని సినిమాలు ప్రేమగురించి బోధిస్తూ, ప్రేమే జీవితం అంటూంటే యువత ఎందుకు అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించదు?, దాడులకు పాల్పడదు?. నేడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాపితంగా అమ్మాయిలపై ప్రేమ పేరుతో 56 దాడులు జరిగాయి. 9మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రిలో అనుష అనే అమ్మాయి తన తల్లిదండ్రులను ప్రేమోన్మాది దాడిలో కోల్పోయి తన ఇద్దరి చెల్లెల భారం మోస్తూ ప్రభుత్వం నుంచి సరియైన సహాయం అందక దిక్కుతోయని స్థితిలో ఒక ప్రయివేట్ టీవీని ఆశ్రయించడం జరిగింది అంటే .. మమ్మల్ని ఆదుకొండని ఆ అమ్మాయి సమాజాన్ని అడుక్కొనే స్థితి ఎందుకు వచ్చింది?. ప్రేమే జీవితం అంటూ సినిమాలు యువతను తప్పుడు మార్గం వైపు మళ్లీస్తుంటే వారిని అరికట్టలేని చట్టాలు, ప్రభుత్వం మనది . ప్రేమ పిచ్చితో దాడులకు పాల్పడుతున్న వారిని చావే న్యాయమని ఎన్‌కౌంటర్లు చేసి శిక్షించాం అంటూ చేతులు దులుపుకుంటున్నారు. అసలు ప్రేమోన్మాద దాడులకు కారణమైన సినిమాలను, సినిమాలు తీసే సిని పెద్దలను శిక్షించకుండా, విద్యార్థులను యంత్రాలుగా మారుస్తున్న విద్యాసంస్థలలో మార్పు తీసుకురాకుండా వదిలేస్తే ఇలాంటి దాడులు పునరావృతమవుతూనే ఉంటాయి.

ప్రపంచంలో అత్యధికంగా యువత వున్న దేశం మనది. ఈ యువతను సక్రమ మార్గంలో పెట్టి వారి యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఈ యువతను ఏదైనా సాధించాలనే తెగువ,ధైర్యం ఉంటాయి. అలాంటి యువతను సరియైనా మార్గాన్ని చూపించకుంటే సమాజానికి ఉపయోగపడకుండా సంఘ విద్రోహులుగా మారే అవకాశం ఉంది. సమాజానికి చోదకశక్తులుగా మారే అవకాశమున్న ఈ యువతను కాపాడుకోవడం సమాజపు తక్షణ కర్తవ్యం. అందుకు సమాజం నడుం కట్టాలి. ముఖ్యంగా తమ అస్తిత్వానికి సవాల్‌గా మారిన ఈ సమస్య పరిష్కారం కోసం అమ్మాయిలు సమరశీల పోరాటాలకు నడుం కట్టాలి. ఈ సమస్య వలన తీవ్ర ఆందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు కూడా, ఆందోళన పడుతూ కూర్చుంటే ఈ సమస్య తగ్గదని గుర్తించాలి. ఇటువంటి సమస్యలను మనపైన రుద్దుతున్న సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని వీరు అర్థం చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా పోరాడాలి. అది ఆధారపడుతూ, కాపాడుతున్న భూస్వామ్యానికి,పితృస్వామ్యానికి వ్యతిరేకంగానూ పోరాడాలి. అప్పుడే ఈ కుహనా ప్రేమను సమాజం నుండి తడిచెయ్యగలం. యువతను చోదకశక్తులుగా నిలుపుకోగలం. ప్రభుత్వం మీడియా, ప్రజాసంఘాలు, విద్యావేత్తలు అటువైపుగా ఆలోచించాలి....

No comments:
Post a Comment