Vvs Sarma |
భగవద్గీత
89
ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్|| 3-40 ||
89
ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్|| 3-40 ||
ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆశ్రయములని చెప్పబడుచున్నవి. వీనివలన కామము ఆత్మ జ్ఞానమును గప్పివైచి మనుజుని సమ్మోహితుని చేయుచున్నవి.
తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్|| 3-41 ||
భరతవంశ శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! నీవు మొదట ఇంద్రియములను నిగ్రహింపవలెను. తరువాత జ్ఞాన విజ్ఞానములను నాశనముచేయునదియు, పాపస్వరూపమైనదియు అగు కామమును జయింపుము.
-----------------------------
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
హైదరాబాద్
No comments:
Post a Comment