మానవ మలమే ఈ బస్సుకు ఇంధనం!
Updated : 12/1/2014 3:47:11 PM
ప్రకృతి పరిరక్షణకు ఇలాంటి వాహనాలు ఎంతగానో తోడ్పడతాయని, దీని ద్వారా పొగ పెద్దగా వెలువడదని జెన్‌ఇకో సంస్థ తెలిపింది. బస్సులో ఫుల్‌ట్యాంక్ మానవ మల ఇంధనం పోస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, ఖర్చు కూడా తక్కువేనని పేర్కొంది. ప్రస్తుతం బ్రిస్టల్ నుంచి బాత్ నగరాల మధ్య దీన్ని తిప్పుతున్నామని, త్వరలో మరిన్ని సర్వీసులను ప్రవేశపెడతామని సంస్థ తెలిపింది. వృథాగా పోయే మన మలమే మనను మోసుకెళ్లడం కొంత ఇబ్బందిగా అనిపించవచ్చునేమో కానీ. ఇది ప్రకృతి పరిరక్షణకు ఎంతో మేలు చేకూర్చే ప్రయత్నమని పర్యావరణవేత్తలు కితాబిస్తున్నారు.
No comments:
Post a Comment