ఆంధ్రులు పార్టీల కొసమా..?
ఆంధ్రాజాతి పార్టీల కోసం బ్రతకట్లేదు.. పార్టీలే జాతి మనుగడ మీద ఆధారపడి బతకాలి ..
పార్టీలే జాతిని ఆడిస్తే..! తోక.. కుక్కను ఆడించినట్లువుతుంది..
ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు .. ఉపేక్షనీయం అంతకన్నా కాదు ..
ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు .. ఉపేక్షనీయం అంతకన్నా కాదు ..
కానీ .. పార్టీలు చేసే ..పనులు .. కార్యక్రమాల మీద జాతి బ్రతుకు - మనుగడ ఆధారపడేటంట్లు పార్టీలు చేస్తున్నాయి.. ఇది దౌర్భాగ్యం అని.. ఇదే దుర్మార్గం అని .. ఈ జాతికి చెప్పే వారెవరు .. ?
ఆంధ్రా సమాజాన్ని తమ చెప్పుచేతల్లో బంధించాలని పార్టీలు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి .. ఇది ప్రమాదకర ధోరణి .. జాతికి - సమాజానికి హాని ..
ఆంధ్రులు సర్వ స్వతంత్ర .. స్వాభావిక ఆలోచనా జాతి .. ఈ జాతి ఆధారపడేవారు కాదు .. ఆదరవు నిచ్చే జాతి .. ఉన్న పరిమిత వనరులు ..సంపదతోనే స్వయంసంవృద్దతను ఏర్పరచుకొనగల జాతి ..
కొద్దిపాటి చేయూతనిస్తే.. అద్భుతాలు చేయగల సమర్ధ జాతి .. మాట సాయానికే ప్రత్యూపకార లక్షణం మెండుగా ఉన్న జాతి ..
ఇలాంటి మూలాలు ఉన్న జాతిని దిక్కు లేని వారీగా చేసిందేవరూ... ? పార్టీలు కాదా..?
విభజన కాలంలో జాతికి ఆలోచనివ్వక.. జరగాల్సిన మేలు చెప్పక.. అయోమయంలోకి నెట్టింది ఈ పార్టీలే..
విభజన కాలంలో జాతికి ఆలోచనివ్వక.. జరగాల్సిన మేలు చెప్పక.. అయోమయంలోకి నెట్టింది ఈ పార్టీలే..
వాళ్ళ అధికార క్రీడా.. కుట్రల రాజకీయ దోపిడీ చూసుకున్నారు తప్ప .. జాతి ప్రగతి - పట్టక ఆదిలోనే బహు మోసం చేసింది ఈ పార్టీలే..
వర్తమానంలో .. ఇ జాతి .. పార్టీలను నిర్దేశించాలి మా కోసం ఇది చేయండని .. అంతేకానీ.. పార్టీలే జాతిని ఆడిస్తే... ! ( కుక్క తోకను ఊపాలి గాని - తోకే కుక్కను ఊపుతుందా..?)
ఆ జాతికి ఉనికి కోల్పోయే పతనం తప్పదు ..
ఆ జాతికి ఉనికి కోల్పోయే పతనం తప్పదు ..
ప్రస్తుత కాలంలో ఆంధ్రాజాతికి అండగా నిలబడి .. మార్గనిర్దేశం చేయగల సమర్ధ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గాని .. వర్గం గాని.. ఒక నిరూపిత చోదక శక్తి( driving force) గాని లేకపోవడం జాతి దురదృష్టం ..
అయితే .. జాతి మేధావులు .. సమాజ హితులు .. పూనుకొని సాధించుకొవాల్సిన సమయం ..
ఆంధ్రాజాతి సువిశాల హితాన్ని దృష్టిలో ఉంచుకొని .. కొందరు చేతులు కలిపి కూర్చొవలసిన తరుణం ..కాదంటారా.. !
పాలకుడిగా ఎన్నికైన పార్టీ వాడు.. గొప్ప వాడిగా చూపబడి ..రుద్దబడుతున్న వాడే గానీ .. వాస్తవ రూపంలో.. ఆడింపబడేవాడే కాని ఆడించేవాడు కాదని నిరూపితమైన కాదనలేని నిజం ..!
పహారా..
పహారా..
No comments:
Post a Comment