భగవద్గీత
84
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః|| 3-35 ||
చక్కగా ఆచరింపబడిన పరధర్మము కంటె గుణరహితమైనను స్వధర్మమే శ్రేష్ఠమైనది. తన ధర్మమునందు ప్రవర్తించినపుడు మరణముకూడా శ్రేయస్కరమే. ఇతరులధర్మము స్వీకరించుట భయానకమైనది.
స్వధర్మము అంటే ఏమిటి? తన స్వభావమునకు అనుగుణమైన ధర్మము. ఎప్పుడూ తనధర్మములో తానుండాలి. రాగద్వేషములు లేకుండా ఉండాలి. స్వధర్మములంటే వర్ణాశ్రమ ధర్మములుకావు. బ్రాహ్మణ దంపతుల కుమారుడు స్వభావముచేత బ్రాహ్మణుడు కాక పోవచ్చును. యుగధర్మమునకు అనుగుణంగా ఉండవచ్చు. ఏవిషయము తన స్వభావమునకు అనుగుణమో అదే ధర్మమును, ద్వేషము, మత్సరము మొదలైనవి లేకుండా నిర్వర్తించవలెను. తనప్రవృత్తికి అనుగుణము, ధర్మబద్ధము అయిన కర్మలేచేయవలెను. పరధర్మమునకు వెళ్ళకుండా ఉండాలంటే అంతఃకరణ శత్రువులను నిర్జించి బుద్ధిని నిగ్రహించుకోవలెను.

No comments:
Post a Comment