మరో కురుక్షేత్ర సంగ్రామంగా ప్రసిద్ధి కెక్కిన 'పల్నాటి యుద్ధం' 1173- 1182 మధ్య కాలంలోజరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పల్నాటి చరిత్ర ఆధారంగా 1947, 1966 సంవత్సరాలలో రెండు చిత్రాలు రూపొందాయి. 1966లో విడుదలైన 'పల్నాటి యుద్ధం'లో బ్రహ్మనాయుడి పాత్రను పోషించారు ఎన్టీఆర్. నాగమ్మ పాత్రను భానుమతి పోషించారు. .
మహావీరుడు, యుక్తిపరుడే కాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, సమానత్వాలను కోరుకున్న తొలి సంఘ సంస్కర్త బ్రహ్మనాయుడు. రాజ్య పాలనలో కుల, మత, వర్గ ప్రభావాలు లేకుండా చూసిన బ్రహ్మనాయుడు అసలు సిసలైన లౌకికవాది. అన్ని వర్గాలతో కలసి చాపకూడు, సహపంక్తి భోజనాలు అనే అభ్యుదయ విధానాలకు శ్రీకారం చుట్టిన సామాజిక విప్లవకారుడాయన.
ఇలాంటి పాత్రలకు ఎన్టీఆర్ సరిసాటి రారెవ్వరు. ఒక కోణంలోంచి పౌరుషాన్ని, మరో కోణం నుంచి సౌభ్రాతృత్వాన్ని పలికించగల ముఖవర్చస్సు ఎన్టీఆర్ సొంతం. ఒక శక్తివంతమైన పాత్ర అనగానే దర్శకుల తొలి ఎంపిక ఎన్టీఆర్. ఇక అది చారిత్రాత్మకమైతే పక్కాగా ఎన్టీఆర్ వేయాల్సిందే. అందుకే ఎన్టీఆర్ ను పురాణం పురుషుడిగా కీర్తిస్తారు అభిమానులు.
బ్రహ్మనాయుడిలో ఉన్న అభ్యుదయ భావాలన్నీ ఎన్టీఆర్ లోనూ ఉన్నాయనడానికి వారిద్దరి పాలనా సారూప్యాలే సాక్ష్యం. తెలంగాణా ప్రాంతంలో పటేల్, పట్వారీ, మునసబు, కరణం వ్యవస్థలను రద్దు చేసిన ఎన్టీఆర్, పూజారులుగా బ్రాహ్మణేతరులకు అవకాశమిచ్చిన ఎన్టీఆర్, తండ్రి ఆస్తి లోనూ, భర్త ఆస్తి లోనూ మహిళలకు హక్కును ఇచ్చిన ఎన్టీఆర్... పల్నాటి బ్రహ్మనాయుడుకు ఏమాత్రం తీసిపోరు.

No comments:
Post a Comment