శ్రీ భగవద్గీత:—
గతర్భర్త ప్రభ్భు: సాక్షి
నివాస: శరణం సుహృత్ !
ప్రభవ: ప్రళయ: స్థానం
నిధానం బీజమవ్యయమ్ !!
నివాస: శరణం సుహృత్ !
ప్రభవ: ప్రళయ: స్థానం
నిధానం బీజమవ్యయమ్ !!
నేనే గతిని, నేనే కర్మ ఫలమును, భర్తను, సర్వ ప్రాణులను పోషించువాడను, సర్వమునకు ప్రభువును, అందరికి స్వామిని, ప్రాణుల యొక్క కర్మలకు మరియు అకర్మలకు సాక్షిని, సర్వ ప్రాణులు నివసించుటకు యోగ్యమైన క్షేత్రమును. నా శరణుజొచ్చిన వారినందరి యొక్క దు:ఖములను దూరము చేయువాడను. జగదుత్పత్తికి కారణమైన వాడను. సర్వ లోకములు దేనియందు లీనమగునో అట్టి ప్రళయమును కూడా నేనే.
మరియు అన్ని విధములైన ప్రాణులు నివసించు స్థానమును మరియు ప్రాణులన్నియు కాలాంతరమందున అనుభవించుటకు యోగ్యమగు కర్మల యొక్క ఫలములకు ఆధారమును నేనే. మరియు వినాశమనునది ఎరుంగనటువంటి మూల పదార్ధమును అనగా బీజమును నేనే. అనగా రూపములు దాల్చుటకు యోగ్యమైన వస్తువులకు నాశములేని మూల పదార్ధమును అనగా కారణ పదార్ధమును నేనే.

No comments:
Post a Comment