UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 20 August 2016

ఉలకని పలకని కన్ను, చూసింది చూసినట్టు గుండెల్లో దాచుకునే కన్ను అది దేవుడి మూడో కన్ను కాదు, విజ్ఞానం రెప్పలు తెరచిన కన్ను రెప్పవేయని కన్ను, అమానవం, నిర్భావం, ప్రాణరహితం, ఐనా చూసే కన్ను చూడడం తప్ప ఏమీ చేయలేని కన్ను, నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపే కన్ను

ప్రాణం లేని కన్ను
(2016ఆగస్టు 11న రాజధాని డిల్లీలో ఒక పౌరుడిని టెంపో ఢీకొట్టి వెళ్లిపోయింది. 450 వాహనాలు పక్కనుంచి వెళ్లినా ఎవరూ ఆగలేదు. ఆగిన ఒక రిక్షావాడు సాయం చేస్తాడేమో అనుకుంటే, మొబైల్ దోచుకుని వెళ్లిపోయాడు)

మట్టిని అణచిన ఆ రోడ్డు మీద ఏ సాయం పూస్తుంది?
మనసుల రద్దుచేసిన ట్రాఫిక్ రద్దీలో ఏ చక్రం ఆగుతుంది?

నవత రాళ్లతో కరడు గట్టిన నాగరిక కాంక్రీట్
రాచమార్గంలో ఏ మానవత పరిమళిస్తుంది?

రహదార్లను వాహనాలు దురాక్రమిస్తే
మనిషికి నడిచే హక్కే లేదు
పొరబాటున నడిస్తే బతికే హక్కే ఉండదు.

డెభ్బైఏళ్ల ఈ స్వతంత్రదేశపు రాజధాని నడిరోడ్డున
ఓ ఓటరు, ఓ పౌరుడు, ఓ మనిషి నెత్తురోడినాడు
అసలు పోరాటమే లేదు కాని ప్రాణాన్ని ఓడినాడు
ఆ బతుకును ఢీకొట్టిన బండి మాత్రం దర్జాగా పారిపోయింది
కాయానికి పడిన గాయాల చిల్లుల్లోంచి రక్తమంతా కారిపోయింది

బ్రేకులున్నా ఆగవు, లైట్లున్నా చూడవు, కళ్లులేని ఆ బళ్లు వందలు
మనిషి గిలగిల కొట్టుకుంటున్నా కరగని బిజీ మనుషులు కొన్ని వేలు
దారిన పోయే రిక్షావాడికి కూడా కాబోయే శవాన్ని దోచుకునేఆశలు

కరగని గుండెల్ని, ఆగని బళ్ళని , తెరవని కళ్లని
అన్నీ తెలుసనుకునే వాళ్లని, అందరినీ అక్కడ చూస్తున్నదో కన్ను

ఉలకని పలకని కన్ను, చూసింది చూసినట్టు గుండెల్లో దాచుకునే కన్ను
అది దేవుడి మూడో కన్ను కాదు, విజ్ఞానం రెప్పలు తెరచిన కన్ను
రెప్పవేయని కన్ను, అమానవం, నిర్భావం, ప్రాణరహితం, ఐనా చూసే కన్ను
చూడడం తప్ప ఏమీ చేయలేని కన్ను, నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపే కన్ను

పక్కనుంచే పోయిన 450 బళ్ళలో 900 కబోదుల కళ్లు
యంత్రాలకటకాల కదలికల సాక్ష్యాలు ముద్రిస్తూ
ప్రాణం లేకపోయినా కేసుకు ప్రాణంపోసే కన్ను ఇటు

అటు సిసి కెమెరాకన్ను- ఇటు ఛీ చీ కామెర కన్ను
ఇటు మూసుకున్న మాస్ కన్ను, అటు మూయడమే తెలియని కన్ను

అటు ‘మంచి’ రెటీనా మాడిన కన్ను ఇటు ‘చెడు’ను పట్టిచెప్పే కన్ను
అటు కాఠిన్యపు గ్లకోమా కన్ను, ఇటు ఏ రోగమూ సోకని కన్ను
అటు మదపు పొరలుగమ్మిన కన్ను ఇటు సత్యం పొరలు తీసే కన్ను.

రోడ్డుమీది ప్రాణభంగాన్ని 70 ఏళ్ల స్వాతంత్ర్యం టివిలో చూపిస్తుందా?
ఎగిరే జెండాలో మూడురంగులకు మనిషి నెత్తుటి ఎరుపు ఎట్లా కనిపిస్తుంది?
సిసీ కన్ను సాక్ష్యాన్ని ఏ న్యాయదేవత పరీక్షిస్తుంది?
మానవత్వాన్ని హత్య చేసిన నాగరికతనుఏ కోర్టు శిక్షిస్తుంది?

మాడభూషి శ్రీధర్ 12.8.2016



No comments:

Post a Comment