
అందరికి అతరాత్మ ఇప్పుడు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారే
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైనబ్రాహ్మణుఁడు మెట్టుభూమి యొకటే
చండాలుఁ డుండేటి సరిభూమి యొకటె
అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటె
దినమహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
కొరలి శిష్టాన్నములుగొనునాఁక లొకటే
తిరుగుదుష్టాన్నములు దినునాఁక లొకటే
పరగ దుర్గంధములపైవాయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
కడఁగి యేనుఁగుమీఁదఁ గాయుయెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయునెండొకటే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైనబ్రాహ్మణుఁడు మెట్టుభూమి యొకటే
చండాలుఁ డుండేటి సరిభూమి యొకటె
అనుగుదేవతలకును అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటె
దినమహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁబేదకును వొక్కటే అవియు
కొరలి శిష్టాన్నములుగొనునాఁక లొకటే
తిరుగుదుష్టాన్నములు దినునాఁక లొకటే
పరగ దుర్గంధములపైవాయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే
కడఁగి యేనుఁగుమీఁదఁ గాయుయెండొకటే
పుడమి శునకముమీఁదఁ బొలయునెండొకటే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే
No comments:
Post a Comment