Sangeetha Koumudi
నాదాత్మరహస్యం...
ప్రపంచవర్తిన్యజజీవ ఏవ
యథాస్తి విశ్వం నిజదృష్టితో మే!
తథైవ నాదస్తనుజోపి నూనం
నాదేస్తి విశ్వం స ఉపాసనీయః!! సంగీతరహస్యమ్!!
యథాస్తి విశ్వం నిజదృష్టితో మే!
తథైవ నాదస్తనుజోపి నూనం
నాదేస్తి విశ్వం స ఉపాసనీయః!! సంగీతరహస్యమ్!!
భావము: జీవుడు అజుడు(పుట్టుక లేని నిత్యసత్యస్వరూపుడు) అటువంటి జీవుడు ప్రపంచంలో పుట్టుక వృద్ధి మరణములు గలవాడుగా ప్రవర్తిస్తున్నాడు. తత్త్వదృష్టితో యోచిస్తే ప్రపంచమే తనలో ఉన్నది. దానిని బయటకు వ్యక్తపరచుకుని మాయాసహకారంతో ఆ ప్రపంచంలో తాను సంచరిస్తున్న అనుభూతిని ఎలా పొందుతున్నాడో.... అదేవిధంగా నాదము మన దేహంనుండి మాట- పాట (సాహిత్యం- సంగీతం) అని నానావిధములుగా ఉద్భవిస్తోంది. వాస్తవానికి (తత్త్వదృష్టితో విచారిస్తే) నాదమునందే ఈ ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఈ రహస్యమును తమకి తాముగా ఎవరు తెలుసుకోలేరో వారు కవులు గాయకులు మాత్రమే. సాధారణంగా లోకంలో గాయకులు దేహమునుండి(శరీరము వీణామృదంగాదిసాధనములనుండి) ఉద్భవించిననాదాన్నే ఆశ్రయించి మరియు దానిని అభ్యసించి దానినే నాదోపాసన అని భ్రాంతిని పొందుతూంటారు. ఎవరు నాదమును దేహోద్భూతంగా కాక సర్వప్రపంచమునకు మూలస్థానం(ఉనికి)గా స్వయంప్రజ్ఞతో(అనుభవవిశేషంతో) తెలుసుకుంటారో వారే నాదోపాసకులు. వారు పరిణామస్థితిలో నాదయోగులుగానూ ఇంకా పరిణమించిన తరువాత నాదాత్మకులుగాను మారి కైవల్యసిద్ధిని పొందుతారు. అటువంటి నాదము సర్వదా సర్వమానవాళికి ఉపాసనీయము 'నాదాధీనం జగత్సర్వం'....
డా. యనమండ్ర శ్రీనివాసశర్మ....
No comments:
Post a Comment