|
విశాఖపట్నం, ఏప్రిల్ 14: గీతం విశ్వవిద్యాలయం నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,5 27 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు మంగళవా రం నిర్వహించిన ఎచీవర్స్‌డే సభలో గీతం వి ద్యా సంస్థల అధ్యక్షులు డాక్టర్ ఎంవీవీఎస్ మూ ర్తి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతం విశాఖప ట్నం, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని ప్రకటించారు. గీతం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానానికి మేనేజ్‌మెంట్ నిపుణతను జోడించి కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలన్నారు. గీతం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రముఖ బహుళజాతి సంస్థలతో పాటు టీసీఎస్, ఎసెంచ్యూర్, విప్రో, వర్చ్యూశా, మారుతి సుజుకీ, ఎల్‌అండ్‌టి వంటి సంస్థలు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ ప్రాంగణ ఇంటర్వ్యూలు నిర్వహించాయని తెలిపారు. అ త్యధికంగా వార్షిక వేతనం రూ. 20 లక్షలకు కొందరు విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొవై్‌స-చాన్సలర్ డి.హరినారాయణ, రిజిస్ర్టార్ .పోతరాజు, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్, ప్రొఫెసర్ వి.కె.కుమార్, ప్రొఫెసర్ ఎస్.గణపతి, ప్రొఫెసర్ ఎన్.లక్ష్మణదాస్, ప్రొఫెసర్ షీలా తదితరులు పాల్గొన్నారు.
|
No comments:
Post a Comment