చౌదరి, రెడ్డి, నాయుడు లాంటి పదాల్ని యువత తొలగించుకోవాలి: జేపి
బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గొప్ప జాతి నిర్మాత, ఈ దేశంలో పుట్టుకతో వివక్షను తొలగించడానికి పోరాడిన సంస్కర్త అని లోక్స సత్తా పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు డా. జయప్రకాష్ నారాయణ అన్నారు. అందుకే మహాత్మాగాంధీతో సమానంగా అంబేద్కర్ ని లోక్ సత్తా తన భావజాల ఐకాన్ గా నిలుపుకుందన్నారు. అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయనకు జేపీ నివాళులర్పించారు.
ఏ కుటుంబంలో పుట్టినా, ప్రతీ బిడ్డకు నాణ్యమైన చదువును అందించి హుందాగా బతకగలిగే వ్యవస్థను నిర్మించినప్పుడే మనం అంబేద్కర్ కలను నెరవేర్చగలమని జేపీ అన్నారు. ప్రతీ యువకుడు, యువతీ కులాన్ని, మతాన్ని విస్మరించి తనకు నచ్చిన జీవిత భాగ్యస్వమిని ఎంచుకుని వివాహం చేసుకుంటే, ఒక తరం కాలంలో కులవ్యవస్థని తొలగించడం సాధ్యమని, అందుకు యువత ముందుకురావాలని జేపీ పిలుపునిచ్చారు. అలాగే యువత అందరూ తమ పేర్లలో కులాన్ని గుర్తించే పదాలని - చౌదరి, రెడ్డి, నాయుడు, వర్మ, యాదవ్, గౌడ్ లాంటి పదాలను తొలగించుకోవాలని జేపీ పిలుపునిచ్చారు.
కులమతాలతీతంగా మనిషి సామర్ధ్యాన్ని, సమాజానికి చేసే మంచిని బట్టి అంచనా వేసే వ్యవస్థ నిర్మాణమే అంబేద్కర్ కీ నిజమైన నివాళి అని జేపీ పేర్కొనారు.

No comments:
Post a Comment