కాలంతో పాటుగా....!!
అర్ధ శతాబ్దానికి హారతులిచ్చేసినా
మారని బతుకుల అయోమయంలో
కాలం చేస్తున్న గాయాల హోరులో
అమ్మాయిలో అమ్మను చూడలేని
కలియుగపు కీచకుల నిరంకుశ
వికటాట్టహాసం వినిపిస్తూనే ఉంది ఓ పక్కన
మోసపోయిన నమ్మకం అంగడి బొమ్మగా మార్చేసినా
అందాల భామలుగా కిరీటాలు పెట్టినా
వలువలద్దిన విలువలు నట్టేట మునిగినా
అవసరాలకు మనసును చంపేస్తున్నా
చిరునవ్వు చాటుగా జలతారు పరదాల
మాటున బడభాగ్నిని దాచేస్తున్న అతివ
ఆటబొమ్మగా అంగడి సరుకుగా మారుతూ
అంతరిక్షాన్ని అలఓకగా చుట్టి వచ్చినా
సాటిలేని మేధకు మేటి చిరునామాగా నిలిచినా
అమ్మతనానికి కొంగ్రొత్త అర్ధం చెప్పినా
ఆగని భ్రూణ హత్యల ఉదంతాలు
లెక్కకు రాని నిర్భయలెందరో ఈనాడు
వస్తుంది మరో శతాబ్దం...
మారని జీవితాల కథలను వెంటేసుకుని
వెళుతుంది కాలంతో పాటుగా....!!
మారని బతుకుల అయోమయంలో
కాలం చేస్తున్న గాయాల హోరులో
అమ్మాయిలో అమ్మను చూడలేని
కలియుగపు కీచకుల నిరంకుశ
వికటాట్టహాసం వినిపిస్తూనే ఉంది ఓ పక్కన
మోసపోయిన నమ్మకం అంగడి బొమ్మగా మార్చేసినా
అందాల భామలుగా కిరీటాలు పెట్టినా
వలువలద్దిన విలువలు నట్టేట మునిగినా
అవసరాలకు మనసును చంపేస్తున్నా
చిరునవ్వు చాటుగా జలతారు పరదాల
మాటున బడభాగ్నిని దాచేస్తున్న అతివ
ఆటబొమ్మగా అంగడి సరుకుగా మారుతూ
అంతరిక్షాన్ని అలఓకగా చుట్టి వచ్చినా
సాటిలేని మేధకు మేటి చిరునామాగా నిలిచినా
అమ్మతనానికి కొంగ్రొత్త అర్ధం చెప్పినా
ఆగని భ్రూణ హత్యల ఉదంతాలు
లెక్కకు రాని నిర్భయలెందరో ఈనాడు
వస్తుంది మరో శతాబ్దం...
మారని జీవితాల కథలను వెంటేసుకుని
వెళుతుంది కాలంతో పాటుగా....!!
...........................................
ఒక మగవాడు, ఎదురైనా మగవాడిలోని గొప్పతనమును గౌరవించకపోవడం వలెనే లోకం లో బౌతిక వత్తిడి పెరిగి ఆడవాళ్లు దుర్వినియోగం చెందుతున్నారు, వస్తు ప్రపంచ మాయ పెరిగి, స్వార్ధం పెరిగి అధిపత్యం సర్వం అనుకోవడం వలన లోకం లో సహజత్వం గొప్పతనం దెబ్బతింటున్నది అని గ్రహించండి. సర్వం మనసుతో నిర్వహించిన మమ్ము ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించండి. లోకం స్వర్ఘ ధామం గా మారుతుంది అని గ్రహించండి. మగవారిలో అహంకారం, నిర్లక్ష్యం ఎంత తగ్గితే అంత మంచిది అని గ్రహించండి. వీలు అయినంత ఉన్నది ఉన్నట్లు ప్రజలు తీసుకోవడం వలన లోకం, దివ్య గా మారుతుంది అని గ్రహించండి.
ధన్యవాదములు
తమ ఆత్మీయులు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు
మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment