UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 14 April 2015

రామన్నపాలెంలో ఇంటికో డ్రైవర్‌.. చివరికి సర్పంచ్ కూడా ! (14-Apr-2015)

- వాహనం ఎక్కితేనే బతుకు బండి సాగేది..
 
- పనులు దొరక్క డ్రైవర్లుగా మారిన 300 మంది
 
- పక్కనే అన్‌రాక్‌ కంపెనీ ఉన్నా ఉద్యోగాలు సున్నా..
 
ఆ ఊరులో ఇంటికో డ్రైవర్‌ ఉన్నారు.. జీపు నుంచి డంపర్‌ వరకు అన్ని వాహనాలను నడుపుతారు.. ఇప్పటికి 300 మంది డ్రైవర్లగా ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి ఊరు కోసం తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
ఆ గ్రామమే రామన్నపాలెం.

ఆంధ్రజ్యోతి - మాకవరపాలెం: మండలంలో రామన్నపాలెంలో 1,400 జనాభా ఉంటోంది. గ్రామంలో 600 ఎకరాల సాగు భూమి ఉంది. 2007 సంవత్సరంలో అన్‌రాక్‌ కంపెనీకి 450 ఎకరాలు వెళ్లిపోగా, మిగిలిన భూమి 150 ఎకరాలు మాత్రమే ఉంది. భూములు పోయి పనులు లేకపోవడంతో ఇక్కడ వారు ఉద్యోగాల వేటలో పడ్డారు. అప్పటికే డ్రైవర్లుగా అల్లు తాతబాబు, చుక్కా పోతురాజు ఉన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న గ్రామంలోని కొంతమంది యువకులు డ్రైవర్లగా శిక్షణ పొందారు. అలా గ్రామంలో యువకులు పనులు లేక డ్రైవర్లుగా మారారు. ఇప్పటివరకు 300 మంది డ్రైవర్లు ఈ గ్రామంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ డ్రైవర్లు వాల్వో, బెంజీలు, డంపర్లు, టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు ఇలా ఏ వాహనాన్ని అయినా నడపగలరు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, నెల్లూరు, సత్తిపల్లి, మణుగూరు, రామగుండం, కరీంనగర్‌, వరంగల్‌, అచ్యుతాపురం బ్రాండిక్స్‌ కంపెనీలో మరికొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అయితే పక్కానే అన్‌రాక్‌ కంపెనీ ఉన్నా రామన్నపాలెంకి చెందిన వారు ఐదుగురు డ్రైవర్లు మాత్రమే ఉన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగాలు చేస్తూ ప్రతి ఏటా గ్రామానికి దసరా, బండితల్లి పండుగకు మాత్రం వస్తుంటారు. అలాగే గ్రామంలో సర్పంచ్‌ పదవులు చేసేవారు లారీ డ్రైవర్లుగానే జీవనం సాగించేవారు కావడం గమనార్హం.

చేయడానికి పనులు లేకే - చుక్కాపోతురాజు, సర్పంచ్‌
గ్రామంలో పనులు లేకపోవడం వల్లే ఇక్క యువకులు ఇతర రాష్ర్టాలు వెళ్లిపోతున్నారు. ఐదేళ్లపాటు మధ్యప్రదేశ్‌లో డ్రైవరుగా ఉద్యోగం చేసి వచ్చాను. ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గ్రామంలో మగవారు అందరూ బయట ప్రాంతాల్లోనే ఉంటారు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే వస్తారు. ఇక్కడ పదవులు చేసినవారు మాజీలైతే తిరిగి మరలా డ్రైవరు ఉద్యోగాలకు వెళ్లిపోతారు.

బండి నడిస్తేనే బతుకు -  చింతల అప్పలనాయుడు...
లారీ నడిస్తేనే బతుకు బండి సాగుతుంది. నలుగురు అన్నదమ్ములం లారీ డ్రైవర్లుగానే మద్యప్రదేశ్‌లో ఉద్యోగాలు సాగిస్తున్నాం. మేమంతా ఏడా దికి రెండుసార్లు మాత్రమే ఇంటికి వస్తాం. ఉద్యోగం సంతృప్తిగా ఉంది. కానీ అయినవారికి దూరంగా ఉంటున్నామనే బాధ ఉంది.

అన్‌రాక్‌లో ఉద్యోగం లేదు - కటారి దేముడు...
లారీ డ్రైవర్లుగా ఇతర రాష్ర్టాలు వారు గుర్తిస్తున్నారు తప్ప పక్కనే ఉన్న అన్‌రాక్‌ కంపెనీ వారు గుర్తించడం లేదు. 300 మంది డ్రైవర్లు ఉన్నా అన్‌రాక్‌ కంపెనీలో మాత్రం ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ పనిలేక నెల్లూరు వెళ్లి అక్కడ వాల్వా కంపెనీలో పని చేస్తున్నాను.

No comments:

Post a Comment