|
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం..విడుదలైన ఐదు రోజులకే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మంగళవారం నాటికి ఈ చిత్రం రూ.215కోట్లు కొల్లగొట్టిందని చెబుతున్నారు. భారతదేశ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులను బాహుబలి తుడిచిపెట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రెండు వందల కోట్లు వసూలు చేయడం అన్నది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అందులోనూ తెలుగు మాతృకగా రూపొందిన చిత్రం ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసుకోవడం తెలుగు వారికి ఆనందం పంచుతున్న అంశం.
తెలుగు సినిమా సత్తా ఏమిటో గతంలో పలు చిత్రాలు రుచి చూపించినా, ఈ సారి 'బాహుబలి' చూపిన సత్తాయే వేరు... ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాళ భాషల్లోనూ విడుదలయింది... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.215 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఇంతకు ముందు 'రోబో' వంటి భారీ చిత్రం వంద కోట్ల క్లబ్బులో చేరిన తొలి దక్షిణాది చిత్రంగా రికార్డు నెలకొల్పింది... అయితే ఆ ఫీటు సాధించడానికి 'రోబో'కు దాదాపు 35 రోజులు పట్టింది... అలాంటిది 'బాహుబలి' చిత్రం కేవలం రెండే రెండు రోజుల్లో సాధించింది. తొలిసారి ఓ దక్షిణాది చిత్రం భారీ హిందీ సినిమాలకు దీటుగా నిలవడం 'బాహుబలి'తోనే సాధ్యమయింది... ఆల్ ఇండియా టాప్ గ్రాసర్స్‌లో నంబర్ వన్ గా నిలిచిన 'పీకే' తరువాతి స్థానం తనదేనంటోంది 'బాహుబలి'
|
No comments:
Post a Comment