|
హైదరాబాద్, ఆగస్టు 11: రాజధానిలో మహిళల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. విదేశీ ఉద్యోగం పేరిట మెసపోయి బెంగళూరు వ్యభిచార కూపం నుంచి తప్పించుకుని వచ్చిన నగరానికి చెందిన ఓ మహిళ మంగళవారం హెచ్చార్సీని ఆశ్రయించింది. విదేశాల్లో ఉద్యోగమని ఎరగా చూపి తనను వారం క్రితం బెంగళూరులో వ్యభిచార కూపంలోకి నెట్టారని, అయితే అక్కడి నుంచి తాను తప్పించుకుని వచ్చానని సదరు మహిళ హెచ్చార్సీకి వివరించింది. తనతో పాటుగా వ్యభిచార కూపంలో మగ్గుతున్న మరో 20 మందిని రక్షించాలని ఆమె హెచ్చార్సీని కోరింది. మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన హెచ్చార్సీ దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించింది.
|
No comments:
Post a Comment