............... జై వీరాంజనేయ.....................
...........ఆశొకవనంలొ హనుమ.............
* శొకరహితమైనది ఆశొకవనం... ఆ పేరుని అక్షర సత్యం చేస్తూ... ఆశొక... మద్ది... పొన్నసాల... వంటి మహా వృక్షములతొ... మామిడి... పనస... జామ... నిమ్మ... దానిమ్మ... తదితర ఫల వృక్షములతొ... లేళ్ల గుంపులతొ... అద్భుతమైన ఆరామ మందిరాలతొ... జలాశయాలతొ... నయన మనొహరంగా... హృదయానంద భరితంగా... అమరేంద్రుని పారిజాత వనాన్నీ తలపిస్తూ... ఆహా.... ఆ స్వర్గ లొకమున వున్న ఉధ్యాన వనము కన్నా మిన్నగా ఉన్నది ఈ ఆశొకవనం అని హనుమ నొటివెంట పలికించింది... మరుక్షణమే తేరుకొని... హనుమ బ్రహ్మచారియైన తననే ఇంతటి సమ్మోహానికి గురిచేసిన ఈ మహద్భుత సౌందర్య వనంలొ... సీతామాత ఎక్కడుంది...? ఎలా కనిపెట్టడం...?
*హనుమ మళ్లీ తన ఆకారమును కొతిపిల్ల పిల్ల రూపంలొకి మార్చుకొని... ఒక మహా వృక్షం పైకి దూకాడు... అక్కడినుంచి మరొ మద్ది వృక్షం పైకి... దాని మీద నుంచి మరొ మహా వృక్షం పైకి... అలా ఆ అశొకవనంలొ శొధిస్తున్న హనుమ ఒక అద్భుతమైన శ్వేత వర్న మందిరమున... దానికి సమీపంలొ రక రకాలైన ఆయుధాలతొ... కావలి కాస్తున్న స్త్రీ రాక్షస మూకలను గమనించాడు హనుమ... ఆ శ్వేత చలువరాతి మండపానికి చేరువులొ... ఓకమహా వృక్షం క్రింద దీన వదనంతొ... మాసిన వస్త్రంతొ... విచార గ్రస్తురాలుగా ఓ స్త్రీమూర్తిని గమనించాడు హనుమ... ఆమే కూర్చొని వున్న ఆ వృక్షం చుట్టూ... రాక్షస స్త్రీలు కూర్చొని వున్నారు...
.............. జై హనుమాన్...................
No comments:
Post a Comment