.......జై వీరాంజనేయ........
"సీతని పరామర్శించిన హనుమ "
👉 సీతమ్మ క్షేమంగా వుంది... సీతమ్మని తానిప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా దర్శిస్తున్నాడు... తన అన్వేషణ పూర్తీ అయింది... ఇక తాను సీతమ్మని పరామర్శించాలి ఆమెకి తనని తాను పరిచియం చేసుకొవాలి... ధైర్యం చెప్పాలి.. రామచంద్రుని సందేశాన్నీ సీతమ్మకి వినిపించాలి... ఇదంతా జరగాలంటే... సీతమ్మ తనని నమ్మాలి... అలా నమ్మకం కలిగించడానికి ఒక్కటే మార్గం... "సీతారామ కథాగానం ".....
👉 హనుమ ఏ మాత్రం ఆలసించకుండ తగ్గు స్వరంతొ... సీతారామకథను ప్రారంభించాడు... శ్రీరామ జననం... విధ్యాభ్యాసం... విశ్వామిత్రుని యాగ సంరక్షణ... తాటక సంహరం... అహల్య శాపవిమోచనం... శివ ధనుర్భంగం... సీతారామ కళ్యాణం... కైక వరాలు... సీతారామలక్ష్మణుల వనవాసం... మాయోపాయంతొ సీతని అపహరించడం రాముని విరహశొకం... సుగ్రీవమైత్రి... సీతా అన్వేషణకై... వానరవీరులు నలుధిశలకూ బయలుదేరడం... రాముడు ప్రత్యేకంగా హనుమకి సీతాన్వేషణ భారం అప్పగించడం... హనుమ సాగరాన్ని లంఘంచి లంకకి చేరడం... వరకు రామకథా గానం చేసి... హనుమ ఛెంగున క్రిందకి దూకి సీతముందు వినయంగ నిలిచి... ఆ హనుమని నేనేనమ్మా... అని తెలిపాడు... పలికాడు వినమ్రంగా... మారుతి పరిమాణంలొ కన్పిస్తున్న హనుమని చూస్తూ... వేలడంతలేవు నీవు రామ బంటువా..? సందేహించింది సీతమ్మ....
.....జై వీరాంజనేయ......
ఇంకావుంది...
No comments:
Post a Comment