తమిళ హీరో సూర్య తనలోని మానవత్వాన్ని, మంచితనాన్ని మరోసారి చాటాడు. 24 షూటింగ్ కోసం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఈడిగపల్లెకు వచ్చారు. అయితే రాత్రి వరకు మదనపల్లి దగ్గర క్వారీలో షూటింగ్ చేసిన ఆయన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. తాను వెళ్తుండగా ఒక మహిళ రోడ్డు ప్రమాదం లో గాయపడి రక్తపు మడుగులో పడి ఉంది. ఇది గమనించిన డ్రైవర్ సూర్యకు చెప్పగా…వెంటనే కిందకు దిగి తన కారులో తీసుకుని తిరుపతి లోని ఆసుపత్రి లో చేర్చించారు. అంతే కాదు ఆమెకు ప్రాథమిక వైద్యం అందే వరకు అక్కడే ఉంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లతో కన్ఫమ్ చేసుకుని వెళ్లారు. డబ్బులు అవసరమైతే నేనిస్తాను.
ఏ ట్రీట్ మెంట్ అయినా చేయండని ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ వెళ్లాడు. ఈ లోపు వాళ్ల బందువులకు సమాచారమివ్వమని చెప్పి …ఆమెతో మాట్లాడి వెళ్లిపోయారు. ఆయన మంచితనం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. సొంత వాళ్లనే పట్టించుకోని రోజుల్లో ఆమె కోసం అరగంటకు పైగా ఆసుప్రతిలో గడిపాడు సూర్య. ఆయనలా ఇతర నాయకులు, సెలబ్రిటీలు కూడా చేస్తే .. అందరిలో మార్పు మొదలవుతుంది. ఎందుకంటే రక్తం కారుతున్న పేదవాళ్లను కారెక్కించుకోవాలంటే కారు పాడువుతుందని, రక్తం అంటుతుందని ఫీలయ్యే వారున్న లోకం మనది...!!

No comments:
Post a Comment