Madhu Gonugunta
గోవింద గోవిందయని కొలువరె
గోవిందాయని కొలువరె॥
హరి యచ్యుతాయని యాడరె
పురుషోత్తమాయని పొగడరె
పరమ పురుషాయని పలుకరె
సిరివర యనుచును చెలగరె జనులు॥
పాండవ వరదాయని పాడరె
అండజవాహను కొనియాడరె
కొండలరాయనినె కోరరె
దండితో మాధవునినె తలచరె జనులు॥
దేవుడు శ్రీవిభుడని తెలియరె
సోవల ననంతుని చూడరె
శ్రీవేంకటనాధుని చేరరే
పావనమై యెప్పుడును బ్రదుకరె జనులు
గోవింద గోవిందయని కొలువరె
గోవిందాయని కొలువరె॥
హరి యచ్యుతాయని యాడరె
పురుషోత్తమాయని పొగడరె
పరమ పురుషాయని పలుకరె
సిరివర యనుచును చెలగరె జనులు॥
పాండవ వరదాయని పాడరె
అండజవాహను కొనియాడరె
కొండలరాయనినె కోరరె
దండితో మాధవునినె తలచరె జనులు॥
దేవుడు శ్రీవిభుడని తెలియరె
సోవల ననంతుని చూడరె
శ్రీవేంకటనాధుని చేరరే
పావనమై యెప్పుడును బ్రదుకరె జనులు
No comments:
Post a Comment