లక్ష్మీ కల్యాణము లీలతోఁ బాడే మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్నుగుబ్బ లివి బూజగుండలు
తీపులమోవితేనెలు తీరని మధుపర్కము
దాపుగఁ బెండ్లి యాడరయ్య తగుఁ దగు మీకును
మాటలుమీ కిద్దరికి మదనమంత్రములు
మేటితలఁబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీటునఁ బెండ్లాడరయ్య నెరవేరె మీకును
కౌఁగిలి కౌఁగిలి మీకు కందువ పెండ్లిచవికె
పాఁగిన కోరికలే పావ కోళ్ళు
ఆఁగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీఁగక పెండ్లాడడయ్య వేడుకాయ మీకును
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్నుగుబ్బ లివి బూజగుండలు
తీపులమోవితేనెలు తీరని మధుపర్కము
దాపుగఁ బెండ్లి యాడరయ్య తగుఁ దగు మీకును
మాటలుమీ కిద్దరికి మదనమంత్రములు
మేటితలఁబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీటునఁ బెండ్లాడరయ్య నెరవేరె మీకును
కౌఁగిలి కౌఁగిలి మీకు కందువ పెండ్లిచవికె
పాఁగిన కోరికలే పావ కోళ్ళు
ఆఁగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీఁగక పెండ్లాడడయ్య వేడుకాయ మీకును
No comments:
Post a Comment