భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోనున్న :సీఎం కేసీఆర్
దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వరంగల్ భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోనున్నారు. ప్రభుత్వం భద్రకాళి అమ్మవారికి 11కిలోల 700 గ్రాముల స్వర్ణ కిరీటాన్ని సమర్పించనుంది. అమ్మవారి కోసం జీఆర్‌టీ జ్యువెల్లర్స్ వారిచే ప్రభుత్వం ప్రత్యేకంగా స్వర్ణ కిరీటాన్ని చేయించింది. ఈ నెల 9న ఉదయం సీఎం కేసీఆర్ సతీసమేతంగా మొక్కు తీర్చుకోనున్నారు.
ఈ మేరకు సాయంత్రం అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించనున్న స్వర్ణ కిరీటాన్ని పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కలెక్టర్ కరుణ, సీపీ సుధీర్‌బాబు ఏర్పాట్లను పరిశీలించారు
No comments:
Post a Comment