ఈ రోజు జగదంబను మహాలక్ష్మీ స్వరూపంగా దర్శిస్తూ మహాలక్ష్మీ అలంకారం వేసి ఆలయంలో ఆరాధించడం కనపడుతూ ఉన్నది. ప్రత్యేకించి విజయవాడ కనకదుర్గమ్మను లక్ష్మీ దేవి స్వరూపంతో దర్శిస్తారు. అంటే ఆ జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది. ఈ లక్ష్మీ దేవికి సంబంధించిన వృత్తాంతములు శాస్త్రములయందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతూ ఉంటుంది.
అయితే సంపద అంటే ఏమిటి? అనేది చూడాలి.
శుద్ధమైన, సౌమ్యమైన, కారుణ్యమయమైన స్వరూపమే లక్ష్మీదేవియొక్క తత్త్వము. అందుకు ఈ తల్లియొక్క స్వరూపము .
శుద్ధ సత్త్వ స్వరూపాయా సా పద్మా పరమాత్మనః! అన్నారు. పరమాత్మయొక్క శుద్ధ సత్త్వ స్వరూపము యొక్క శక్తియే లక్ష్మి. శుద్ధ సత్త్వము అంటే రజోగుణం, తమో గుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటటువంటి శుద్ధమైన జ్ఞానానంద స్వరూపము. సత్త్వగుణ లక్షణము జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానందములు రజోగుణతమోగుణ దోషములు లేకుండా ఉంటే తను శుద్ధ స్వరూపము అని అన్నారు. అది ప్రధానంగా లక్ష్మీదేవిలో గమనించవలసిన అంశం. అందుకని ఎవరైతే సత్త్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవియొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు. లేదా లక్ష్మీ దేవిని ఆరాధిస్తూంటే వారిలో శుద్ధ సత్త్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి.
సర్వ సంపత్స్వరూపా సా తదధిష్ఠాత్రు దేవతా!! అంటుంది దేవీ భాగవతం. సర్వ సంపత్తులయొక్క స్వరూపిణీ ఆ తల్లి. పైగా సంపదలకు అధిష్ఠాన దేవత.
కాంతాతి దాంతా శాంతా చ సుశీలా సర్వమంగళా!
లోభమోహ కామ రోష మదహంకార వర్జితా!!
కాంతా అతి దాంతా – కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్స్వరూపము, దాంత అంటే నిగ్రహ స్వరూపిణి అని అర్థం. తేజస్సు, నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము – ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు. ఉత్తమ శక్తులయొక్క స్వరూపిణియే ఆ తల్లి. సుశీల – చక్కని స్వభావమును కలిగి ఉన్నటువంటి తల్లి, సర్వ మంగళా – అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి. లోభమోహ కామ రోష మదహంకార వర్జితా – లోభము, మోహము, కామము, రోశము, మదము, అహంకారము – ఇవి లేవుట ఆ తల్లి వద్ద. ఇవన్నీ కూడా చెప్పడం ఏమిటంటే లక్ష్మీ దేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి ఆవిడ. అందుకు ఆ మంచి గుణాలయొక్క సాకార స్వరూపమైన లక్ష్మీ దేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతూంటాయి. పైగా లక్ష్మీ ఆరాధన చేయాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి. నారాయణుడు లక్ష్మీ ప్రియుడు. లక్ష్మీ దేవికి నారాయణుడే సర్వస్వము. దీని భావన అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారిపట్ల నారాయణుని ప్రీతి కలుగుతుంది అని భావం. అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సర్వస్వం అని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు. అది తాత్త్వికంగా మనం తెలుసుకోవలసిన సంకేతం.

All the songs from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

No comments:
Post a Comment