
భగవద్గీత పోటీలో గెలిచిన 12 ఏళ్ళ ముస్లిం బాలిక..
ముస్లిం బాలిక మర్యమ్ సిద్దిఖి భగవద్గీత బోధనలను సరైన పద్దతిలో అందరికంటే బాగా వివరించినందుకు భగవద్గీత ఛాంపియన్స్ లీగ్ పోటీలో గెలుపోందింది.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ఇస్కాన్) నిర్వహించిన ఈ భగవద్గీత ఛాంపియన్స్ లీగ్ పోటీలో 3వేల మంది పాల్గొనగా 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల మర్యమ్ సిద్దిఖి మొదటి స్థానం సంపాదించింది.
ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో వంద మార్కులకు నిర్వహించబడింది. ముంబాయ్లోని మీరా రోడ్లో కాస్మోపాలిటన్ హైస్కూల్లో చదువుతున్న సిద్దిఖి మతాలంటే తనకు ఆశక్తని చెబుతోంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా వాటి గురించి ఉత్సాహంగా చదువుతుంటానంటోంది. తన టీచర్ ఈ కాంపిటిషన్ గురించి చెప్పగానే పాల్గొన్నాని చెబుతోంది.
No comments:
Post a Comment