చిరంజీవి జన్మదిన వేడుకలకు మెగా ఏర్పాట్లు
మెగాస్టార్ చిరంజీవి త్వరలో 60 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి 22 వరకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి చిరంజీవి అభిమానులు ఇప్పటినుంచే ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు.
ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆదివారం ఏలూరులో నిర్వహించిన చిరంజీవి యువత మూడవ రాష్ట్ర సమావేశంలో తెలిపారు.
వారోత్సవాలను తెలుగు రాష్ట్రాల్లో నేత్రదానం, కిడ్నీ దానం, అవయవ దానం వంటి సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్దం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా అత్యధిక సార్లు రక్తదానం చేసిన చిరంజీవి అభిమానులకు బంగారు పతకాలు కూడా అందిస్తామని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి మంది అభిమానుల జాబితా ను కూడా సిద్ధం చేశారట.
ఈ వేడుకలను హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారట. ఇది చిరంజీవికి 60వ పుట్టిన రోజు కావడం తో అభిమానులు ఉత్సాహంగా పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారని వినికిడి.
No comments:
Post a Comment