ఉక్కిరి బిక్కిరి అవుతున్న సూర్య
హీరో సూర్య భార్య అయిన హీరోయిన్ జ్యోతిక తన సొంత బ్యానర్లో ’36 వయదినిలే’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. జ్యోతిక అభినయం అదుర్స్ అంటూ అభిమానులే కాదు ప్రముఖులు సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇక సూర్య తల్లిదండ్రులు అంటే జ్యోతిక అత్తమామలు ఆమె నటనని ఎంతగానో అభినందించారట. తనకన్నా జ్యోతిక చాలా బాగా చేసిందని వాళ్లు అంటూ వుండటం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని సూర్య చెబుతున్నాడు. రెండు వారాలలోనే ఈ సినిమా 10 కోట్లకి పైగా వసూలు చేసి నిర్మాతగా తనకి లాభాలు తెచ్చి పెట్టడం తన భార్య నటనకి ప్రశంసలు దక్కడం ఆనందంగా ఉందని అంటున్నాడు. సంతోషంతో సూర్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు సూర్య. ఈ ఉత్సాహంతో తాను జ్యోతిక కలిసి తెరపై కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాననీ, త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుందని చెప్పుకొచ్చాడు.
No comments:
Post a Comment