// వీళ్ళూ మనుషులే //
మన పరిస్దితికి ప్రభుత్వాలకేం సంబందం లేదు ఆ దేవుడి దయే కారణం అనే రాజరికపు రాజకీయ ఎత్తుగడల్లోంచి పుట్టిన మతాన్ని, ఈ రోడ్డుపక్క పందులపాకల్లో(పందులైనా ఇందులో ఉంటాయో ఉద్యమిస్తాయో?)
మనుషులవేషాల్లో తిరుగుతున్న సామాజిక రాజకీయభాదితులు, విసిరిపారేయరా..?తమ వైభవోపేతమైన జీవనానికి తాము నమ్మిన దైవానుగ్రహమే కారణమంటే దేవుణ్ణి మార్చేయరా.? మతమంటే దద్దోజనాలు.,నైవేద్యాలు అంటే వెన్నుకంటిన వీళ్ళ డొక్కలో మంట పుట్టదా?,మతసంప్రదాయమంటే పట్టుచీనాంబరాలు, అలంకారాలంటే చిరుగుల గుడ్డతో కప్పుకోలేని వీళ్ళ ఒళ్ళు మండదా.? తాళింపుకి నూనె మొఖమెరగని వీళ్ళ ముఖాలకి నేతిదీపాలెలిగించమంటే ...? దైవనిందకి నరకం తప్పదంటే నవ్వుతారు నరకం మాకు కొత్తా అని..! అందర్నీ చెయ్యెత్తి పలకరించే మనిషి వీళ్ళని ముక్కు మూసుకుని పలకరిస్తున్న ప్రతిసారి వీళ్ళకి ఆ దేవుడు జ్ఞాపకానికి రాడా.?
అందుకే వీళ్ళు మతం - మారలేదు.మనం కారో , బైకో ఆలోచించుకుని ఎంచుకుని , కొటేషన్ తెప్పించుకుని మార్చేంత దీమా, వెసులుబాటు వీళ్ళకి లేక అత్యవసరంగా మతంలోంచి పారిపోయారు.కళ్ళు మూసుకుని నెత్తిన చెంగేసుకుంటే చాలు దైవంలో మునకేసే ఓ మతంలోకి.శ్వాస లోనే దేవుణ్ణి దర్శించ గలిగే కొత్త మతాలలోకి దూకేసారు.దాక్కొండిపోయారు..!
ఇప్పటికైనా మన స్దితి మన ప్రభుత్వ ,పాలనా , పాలకుల అదికారుల మహా ప్రసాదమని ముందు తరాలకి చెప్పకపోతే మనుషుల కంటే మతాలెక్కువైపోతాయి..! ఓటర్ల కంటే రాజకీయ భాదితులెక్కువైపోతారు.! తప్పదు ప్రత్యామ్నాయ ఆలోచన మానవసహజాతం. ఇన్ని నాగరికతల అభివృద్దిమూలం కూడా ఇదే.!
నేను090515
No comments:
Post a Comment