మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున కాకినాడలో 500కేజీల కేక్ తయారుచేసారట. దేనికోసం.?? దాని బదులు 'పది మొక్కలు' నాటొచ్చుగా.??అసలు ఫ్లెక్స్ లకు పూజలు, పాలాభిషేకం ఏంటండి.??
దాని బదులు అవే పాలు, పళ్ళును సినిమా రిలీజు రోజునా ఏ అనాధ ఆశ్రమానికో ఉచితంగా ఇవ్వొచ్చుగా.??
మొన్న భీమవరంలో ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్లెక్స్ ల గురుంచి తలలు పగిలేగా తీవ్రంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇంతే గొడవ, మీ భీమవరానికి ఒక IIT కావాలనో, ఒక NIT కావాలనో, ఒక ప్రాజెక్ట్ కావాలనో, లేక , ఒక ఇండస్ట్రీ కావాలనో ప్రభుత్వంపై అంతే పోరాటం చేసి ఉంటే, మన ఉరు రూపురేకలే మారిపోయేవి కదా.??
ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ విష సంస్కృతి మన దేశంలో ఉంది. అటు పవన్ కళ్యాణ్ బానే ఉన్నాడు, ఇటు ప్రభాస్ బానే ఉన్నాడు, కానీ ఫ్లెక్స్ కోసం కొట్టుకోవడంతో తలలుపగిలి ఆసుపత్రి పాలైనది మాత్రం వెర్రి అభిమానులే!!
ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు..దయచేసి ఆలోచించండి..!!
No comments:
Post a Comment