కాళీయ మర్దనం - 49:
10.1-684-క.
లోక జనిస్థితిలయములు
గైకొని చేయుదువు త్రిగుణకలితుఁడవై కా
లాకారమున నమోఘ
శ్రీకలితుఁడ వగుచు నిచ్చ చెందక యీశా!
లోక = జగత్తునకు; జని = బ్రహ్మరూపమున సృష్టి; స్థితి = విష్ణురూపమునపాలన; లయములు = శివరూపమునలయము; కైకొని = స్వీకరించి; చేయుదువు = నీవే ఆచరించెదవు; త్రిగుణ = మూడు గుణములు తోడ {త్రిగుణములు - 1శాంతవృత్తిగల సత్వగుణము 2ఘోరవృత్తిగల రజోగుణము 3మూఢవృత్తిగల తమోగుణము అనెడి మూడుగుణములు}; కలితుండవు = కూడుకొన్నవాడవు; ఐ = అయ్యి; కాల = కాలము యొక్క {కాలము - నిమేష ప్రళయాది రూపములు కలది, సర్వము కలిగించెడిది}; ఆకారమునన్ = స్వరూపముతో; అమోఘ = వ్యర్థముకాని, తిరుగులేని; శ్రీ = షడ్గుణ్య అశ్వైర్యములు; కలితుడవు = కలవాడవు; అగుచున్ = అగుచు; నిచ్చన్ = అపేక్షను; చెందక = పొందక; ఈశా = కృష్ణా {ఈశుడు - బ్రహ్మాదులను సృష్ట్యాది కార్యములందు నియమించు వాడు, విష్ణువు}.
१०.१-६८४-क.
लोक जनिस्थितिलयमुलु
गैकोनि चेयुदुवु त्रिगुणकलितुँडवै का
लाकारमुन नमोघ
श्रीकलितुँड वगुचु निच्च चेंदक यीशा!
పరమేశ్వరా! నీవు తిరుగులేని అష్టైశ్వర్యాలూ కలవాడవు. కాల స్వరూపుడవు. త్రిగుణాలను అవలంభించిన వాడవు. అయినట్టి నీవు ఎట్టి అపేక్ష పొందక, ఈ లోకాలను అన్నిటినీ పుట్టిస్తూ, నిలబెట్టుతూ, నశింపచేస్తూ ఉంటావు.
http:// telugubhagavatam.org/ ?tebha&Skanda=10.1&Ghatta=8 3&Padyam=684.0
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

http://
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment