ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు..
సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం..
ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది.
అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.
బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. “ హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా ” అనే మంత్రం జపించాలి. అమ్మవారికి దద్థ్యన్నం, కట్టెపొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి

No comments:
Post a Comment