BMW కారు తిరిగి ఇచ్చేస్తున్న దీపాకర్మాకర్
ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది దీపా కర్మాకర్. కోట్లాది మంది భారతీయుల మదిలో స్థానం గెలుచుకుంది. దీపా నింపిన స్ఫూర్తికి గుర్తింపుగా చాముండేశ్వరీనాథ్.. క్రికెట్ లెజండ్ సచిన్ చేతుల మీదుగా BMW కారు బహుకరించారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ కారు తాళాలు అందించారు సచిన్ టెండూల్కర్. అదే కారును ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది దీపా.దీపా చెబుతున్న రీజన్స్ :
… తనకు బహూకరించిన బీఎండబ్ల్యూ కారును మెయిన్‌టెయిన్ చేయలేక చాముండేశ్వరీ నాథ్‌కు తిరిగి ఇచ్చేయాలనుకుంటోందట దీపా కర్మాకర్.
… అంత స్టయిలిష్ కారులో షికారు చేయటానికి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తాల రోడ్లు కూడా బాగోలేవంట. ఆ రోడ్లపై కారు నడపటం కష్టంగా ఉందని చెబుతోంది దీపా.
… అగర్తాలా రోడ్లు చాలా చిన్నవి. గతుకులు, గుంతలతో ఘోరంగా ఉండటంతో BMW కారును నడపలేక పోతోందట దీపా.
… ఈ కాస్ట్లీ కారుకు వస్తున్న రిపేర్ల ఖర్చు చాలా ఎక్కవగా ఉందంట. ఈ ఖర్చులు భరించటం కూడా ఆర్థికంగా ఇబ్బందిగా ఉందంట. బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్లు అగర్తలాలో లేవు.
… జర్మనీలో జరిగే ఛాలెంజర్స్ కప్‌కు ఒక నెలనే సమయం ఉండటంతో ఇక ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలని కోచ్ నంది చెప్పారు.
… BMW తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయం కుటుంబ సభ్యులతో కలిసి దీపా తీసుకున్న నిర్ణయమని కోచ్ నంది తెలిపారు.





No comments:
Post a Comment