UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 12 April 2015

పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలివ్వాలి జైట్లీ, వెంకయ్య వల్లే విభజన హామీల అమలు త్వరలో అనంతలో సెంట్రల్‌ వర్సిటీ: బాబు ఏపీకి పూర్తి అండగా ఉంటాం: అరుణ్‌జైట్లీ కర్నూలులో రక్షణ కర్మాగారం: వెంకయ్య జాతీయ కస్టమ్స్‌ అకాడమీకి శంకుస్థాపన



పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలివ్వాలి
జైట్లీ, వెంకయ్య వల్లే విభజన హామీల అమలు
త్వరలో అనంతలో సెంట్రల్‌ వర్సిటీ: బాబు
ఏపీకి పూర్తి అండగా ఉంటాం: అరుణ్‌జైట్లీ
కర్నూలులో రక్షణ కర్మాగారం: వెంకయ్య
జాతీయ కస్టమ్స్‌ అకాడమీకి శంకుస్థాపన
అనంతపురం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పది నెలల కాలంలో కేంద్ర సహకారంతో కొన్ని పనులు నెరవేర్చామని, పొరుగు రాష్ర్టాల సరసన ఏపీని నిలబెట్టాలంటే పదేళ్ల పాటు కేంద్రం సహకరించాల్సిన అవసర ం ఉందని అన్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద 500 ఎకరాల్లో రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ నార్కోటిక్స్‌ అకాడమీకి కేంద్ర మంత్రులతో కలిసి శనివారం సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వెనుకబడిన అనంతపురంలో త్వరలోనే సెంట్రల్‌ యూనివర్సిటీకి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. ఏపీకి కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు చొరవతోనే విభజన హామీలు అమలవుతున్నాయన్నారు. అభివృద్ధి చెందిన పొరుగు రాష్ర్టాల సరసన ఆంధ్రప్రదేశ్‌ను నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి సాధించడం కష్టమన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతోపాటు సీమ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పించాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి పరుస్తామన్నారు. నీరు లేకుండా పరిశ్రమల విస్తరణ జరగదని, నదుల అనుసంధానం ద్వారానే సీమ జిల్లాలకు నీరివ్వటం సాధ్యమవుతుందన్నారు. నాలుగైదేళ్లల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమ ద్వారా సీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి తాగు,సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలుచేసి మాట నిలబెట్టుకున్నానన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.10వేలు మాఫీ చేయడంతోపాటు వడ్డీ డబ్బులను ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. చేనేతలకు రుణ మాఫీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీకి అండగా నిలుస్తాం: అరుణ్‌ జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ అవసరాలను కేంద్రం గుర్తించిందన్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు రావటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయన్నారు. ఒకటి సెంట్రల్‌ కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ నార్కోటిక్స్‌ అకాడమీ శంకుస్థాపనతోపాటు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయటానికి వచ్చానన్నారు. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార ్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా బెంగుళూరు నగరానికి అతి సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరం అదే ఆలోచన చేస్తున్నామన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.
విభజనకు కాంగ్రెస్‌ మూల్యం : వెంకయ్య
రాష్ట్ర విభజనతో లబ్ధి పొందుదామనుకున్న కాంగ్రెస్‌ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక రాయితీలిస్తే, తమ రాషా్ట్రనికి కొత్త పరిశ్రమలు రావని కేరళకు చెందిన కాంగ్రె్‌సపార్టీ సీనియర్‌ నేత వీరప్పమొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ చట్టంలో ఎందుకు పెట్టలేదో సమాధానమివ్వాలన్నారు. విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని అమలుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతానికి పన్నుల రాయితీ కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నిర్ణీత సమయంలో పోలవరాన్ని పూర్తి చేసి సీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించి రైతులను ఆదుకుంటామన్నారు. విశాఖ రైల్వేజోన్‌ అనుమతి కోసం ప్రయత్నిస్తామన్నారు. కర్నూలులో రక్షణ కర్మాగారం, చిత్తూరులో కేంద్ర రక్షణ శిక్షణ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

No comments:

Post a Comment