
టిటిడి పాలకమండలి సభ్యుడిగా దర్శకేంద్రుడు ప్రమాణస్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి సన్నిధిలోని బంగారువాకిలి ఎదుట కె.రాఘవేంద్రరావుతో టిటిడి ఈవో డి.సాంబబశివరావు ప్రమాణం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న రాఘవేంద్రరావు రంగానాయకుల మండపానికి చేరుకోగా... పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, ఆధ్యాత్మిక గ్రంధాలను అందజేసి సత్కరించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో టిటిడి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత భారవి పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.





No comments:
Post a Comment