జన విజ్ఞాన/అజ్ఞాన వేదికల పేరుతో కొంత మంది చేసే పనులు మార్పు కాదు కదా ఏమీ చేయలేరనే భావం నాకు బలంగా ఉంది. .. ఒక్క హిందూ మతములోనే మూడాచారాలు లేవు. అవి అన్ని మతాలలోను ఉన్నాయి. ఆ చేసే ప్రక్షాళన ఏదో అందరినీ వికసింపజేయాలని చేస్తే అందరూ హర్షిస్తారు. ఒక్క హిందూ మతము మీదే ఇలాంటి దాడులు చేస్తే వారి ప్రక్షాళన కాదు సరి కదా ఎదురు దెబ్బలు తిని తల బొప్పి కట్టించుకోవాల్సి ఉంటుంది. హిందు మతములో కొన్ని దురాచారాలు ఉన్నాయి.. కాదనడం లేదు. అలా అని వేరే మతములో లేక పోలేదు కదా? మరి అందరి మేలు కోరే వారు అయితే ప్రక్షాళన అన్ని వైపులా జరగాలి. కానీ అలా జరగడం లేదే? మంచి అన్నది ఎక్కడ ఉన్నా గ్రహించాలి. చెడు అన్నది ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాలి. మన ఆచారాలలో సైన్స్ లేదని అంటారా? ఇది సనాతనం అన్నిటికీ ఆధారాలు చూపించక్కర లేదు. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. జ్వరం వస్తే అప్పటిలో మనకు లంకణం పరమౌషదం అన్నారు. పసుపు తాడు వేసే వారుట అప్పట్లో. అవి మూడ నమ్మకాలు కాదు. చికెన్ ఫాక్స్ వస్తే వేప ఆకు ఉండలు ఇచ్చే వాళ్ళుట . వేప ఆకుల మీద పరుండ బెట్టే వారు ఇది మూడ నమ్మకం కాదు అప్పటి కాలము నాటి సైన్స్ అది. అవి మూడ నమ్మకం కాదు. జలుబు, దగ్గు, రొంప చేస్తే కషాయం కాచుకుని, ఉప్పు కప్పరెల్ల ఆకు తినే వారు, పాలలో మిరియాల పొడి లేదా పసుపు వేసుకుని తాగే వారు . అవి తగ్గి పోయేవి . అవి అప్పటి సైన్స్ .స్త్రీలు కాళ్ళకు పసుపు కున్నా అందులో సైన్స్ ఉంది. ఇంటి ముందు ఆవు పేడ నీళ్లు చల్లినా అందులో సైన్స్ ఉంది. ముగ్గులు వేసినా అందులో సైన్స్ మరియు అలంకరణ ఉంది. విజ్ఞానం లేదనడం అజ్ఞానము అహంకారమే అవుతుంది.మళ్ళీ చెబుతున్నాను మంచిని ఎక్కడ ఉన్నా గ్రహించాలి.చెడును ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాలి. ఏ ఒక్కరి మీదనో పక్షపాత ధోరణిలో చేస్తే అది తప్పు. అలా చేయకపోతే మీరు మార్పు తేలేరు సరి కదా ఎదురు దెబ్బలు తినడం సహజం. ముందు మార్పు కావాలి తేవాలి అనే వారు ఆమార్పులో బాగం కావాలి. ఏదైనా మనం మార్పు తేవాలి అనుకున్నపుడు ముందు మనం దానిని అనుసరించాలి . అనుసరించి అందులోని లోటు పాట్లను గమనిచాలి . ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాలి. తెల్సుకుని మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పాలి అంతే కానీ అలా ఏదీ చేయకుండా మొత్తం అంతా చెడే , మూడనమ్మకం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. సరి కదా ఎదురు దెబ్బలు తగులుతాయి . అలా చేస్తే మీరు మార్పు కాదు కదా, ఉన్న వాటిని మరింత పటిస్థ పరచడానికి ప్రయత్నించినట్టు లెక్క.
సర్వే జనాః సుఖినోభవంతు
No comments:
Post a Comment