(( దేహంలోకి తూటాలు దూసుకెళ్తున్నా..వెన్నుచూపని వీర జవాన్ !! ))
ఉగ్రమూకలు దాడిలో తూటాలు కడుపులో దూసుకుపోతున్నా అతను వెన్నుచూపలేదు.ప్రాణాలకు తెగించి ముందుకు కదిలాడు. గంటసేపు పోరాడి వారిని నిలువరించారు.
దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారు. ఆయన వారిని కనుక ఆపకపోయి ఉంటే ఎయిర్ బేస్ లో కీలకమైన యుద్ధవిమానాలు తునాతునకలయ్యేవే. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాటం చేసిన ఆ వీరుడు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనే కమెండో
"శైలేష్ గౌర్"
"శైలేష్ గౌర్"
జనవరి 2వ తేదీ, తెల్లవారుజాము 3 గంటల సమయంలో "పఠాన్‌కోట్" ఎయిర్‌బేస్‌లోని మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ బేస్ దగ్గర నలుగురు ఉగ్రవాదులు మాటు వేశారు. వారిని మట్టుబెట్టేందుకు 12 మంది గరుడ కమెండోలు రంగంలోకి దిగారు. ముందుగా ఇద్దరిద్దరు మూడు బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులను కదలకుండా నిలువరించారు. మరో 3 బృందాలు వెనక నుంచి కాల్పులు ప్రారంభించాయి. ముందు వరుసలో ఉన్న కమెండో "గురుసేవక్ సింగ్", ఓ వింగ్ కమాండర్ ముందుగా దాడి ప్రారంభించారు.
వారి వెనక నుంచి కమెండోలు "శైలేశ్ గౌర్, కేతల్"లు కాల్పులు మొదలుపెట్టారు. "గురుసేవక్" దేహంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. అయినా, ఆయన కాల్పులు ఆపలేదు. చివరికి ఆయన నేలకొరిగారు. "శైలేశ్, కేతల్"లు మెరుపువేగంతో ముందుకు కదిలారు. అయితే, ఉగ్రమూకల నుంచి వచ్చిన తూటాలు ఆరుకుపైగా "శైలేశ్" పొత్తికడుపులోకి దూసుకుపోయాయి. అయినా, "శైలేశ్" కూడా వెన్నుచూపలేదు. "కేతల్‌తో" కలిసి ఏకంగా గంటసేపు పోరాడుతూ ముష్కరులను నిలువరించారు. దీంతో బిత్తరపోయిన ఉగ్రవాదులు మెకానికల్ ట్రాన్స్ పోర్ట్ ఏరియా నుంచి వెనక్కి పారిపోయారు.
శరీరం అంతా బుల్లెట్ల గాయాలతో తూట్లు పడ్డ "శైలేష్" ను మూడు గంటల తరువాత కానీ ఎయిర్ బేస్ బయట ఉన్న ఆసుపత్రికి తరలించలేకపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ 24 ఏళ్ల ఆ (( వీరజవాను )) మృత్యువును జయించాలని కోరుకుందాం.

No comments:
Post a Comment