అధ్యాత్మ రామాయణము
శ్రీరామ పరబ్రహ్మణే నమః
బాలకాండము
ప్రథమ సర్గము
శ్రీ సీతారామహనుమత్సంవాదము...
-------------------------------------------------------
-------------------------------------------------------
పురా రామాయణే రామో రావణం దేవకంటకమ్ |
హత్వా రణే రణశ్లాఘీ సపుత్రబలవాహనమ్ || ౨౬ ||
హత్వా రణే రణశ్లాఘీ సపుత్రబలవాహనమ్ || ౨౬ ||
సీతయా సహ సుగ్రీవలక్ష్మణాభ్యాం సమన్వితః |
అయోధ్యామగమద్రామో హనూమత్ర్పముఖైర్వృతః || ౨౭ ||
అయోధ్యామగమద్రామో హనూమత్ర్పముఖైర్వృతః || ౨౭ ||
పూర్వము రామావతార సమయమున యుద్ధకోవిదుడైన శ్రీరామచంద్రుడు దేవగణములకు కంటకుడగు రావణుని, అతని పుత్రులను, సైన్యమును, వాహనసహితముగా యుద్ధమున అతనిని పరిమార్చి, సీతాసుగ్రీవలక్ష్మణసహితుడై, హనుమదాది వానర పరివృతుడై అయోధ్యానగరమును చేరెను.
అభిషిక్తః పరివృతో వసిష్ఠాద్యైర్మహాత్మభిః |
సింహాసనే సమాసీనః కోటిసూర్యసమప్రభః || ౨౮ ||
సింహాసనే సమాసీనః కోటిసూర్యసమప్రభః || ౨౮ ||
అచట రాజ్యాభిషేకము చేసికొని వసిష్ఠాది మహర్షులచేత పరివృతుడై అనంత సూర్యప్రభాభాసమానుడై శ్రీరామచంద్రుడు సింహాసనమున విరాజిల్లుచుండెను.
దృష్ట్యా తదా హనూమంతం ప్రాంజలిం పురతః స్థితమ్ |
కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిమ్ || ౨౯ ||
కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిమ్ || ౨౯ ||
రామఃసీతాయువాచేదం బ్రూహి తత్త్వం హనూమతే |
నిష్కల్మషోzయం జ్ఞానస్య ప్రాతం నౌ నిత్యభక్తిమాన్ || ౩౦ ||
నిష్కల్మషోzయం జ్ఞానస్య ప్రాతం నౌ నిత్యభక్తిమాన్ || ౩౦ ||
సమస్త కార్యములను నెరవేర్చువాడు ( కృతకృత్యుడు ) , ఏ కోరికలు లేనివాడు, పరమాత్మ జ్ఞానమునందు మాత్రమే మనసు నిలిపినవాడు, మహాబుద్ధిశాలియగు హనుమంతుడు అంజలి ఘటించి సీతారాముల ఎదుట నిలిచెను. ఎదురుగా నిలిచిన హనుమను చూచిన శ్రీరాముడు సీతాదేవితో ఇట్లు పలికెను -- " సీతా! ఈ హనుమ మన ఇరువురియందు అచంచలమైన భక్తిగలవాడు. పాపరహితుడు, జ్ఞానము పొందుటకు యోగ్యుడు. కనుక, నీవు ఇతనికి నా తత్త్వమును ఉపదేశింపుము. "
తథేతి జానకీ ప్రాహ తత్త్వం రామస్య నిశ్చితమ్ |
హనూమతే ప్రపన్నాయ సీతా లోకవిమోహినీ || ౩౧ ||
హనూమతే ప్రపన్నాయ సీతా లోకవిమోహినీ || ౩౧ ||
అంతట లోకమోహిని, ( లోకుల సమస్త మోహమునకు తానే కారణమై తిరిగి ఆ మోహమును తానే నివారింపగలిగియున్నందున శ్రీరామాజ్ఞను వినిన) జనకనందినియగు సీత శ్రీరామునితో " అట్లే " నని చెప్పి శరణాగతుడగు హనుమంతునికి రామచంద్రుని యథార్థ తత్త్వమును తెలియజేయుటకు ఉపక్రమించెను.
-----------------------
శ్రీరామ పరబ్రహ్మణే నమః
No comments:
Post a Comment