అయ్యా మోడిగారు,ఇది నేటి సామాన్యుని ప్రశ్న!-----------------------------శేఖర్ బాబు
దేశంలో నల్లదనం, అవినీతి ఎక్కువైంది అని నోట్లు రద్దు చేసారు. మరి పోలీసు వ్యవస్థ కూడా బ్రిటిష్ వారిచే ఏర్పరచబడింది. అప్పట్లో వాళ్లకు ఎదురుతిరిగిన భారతీయుల్ని, కొట్టి జైళ్ళలో పెట్టడానికే ఆ వ్యవస్థను ఏర్పరిచారు. అదే బ్రిటిష్ వాళ్ళ దేశంలో వాళ్ళ సొంత దేశస్తుల కోసం ఏర్పరిచిన పోలీసు వ్యవస్థ సామాన్యులతో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తుందో చూడండి. ఎందుకు ఈ వివక్షత?? మనల్ని దోచుకెళ్ళిన వారు ఏర్పరిచిన వ్యవస్తలో మార్పులు చేసి ఇతర దేశాల పోలీసుల లాగ సామజిక ప్రవర్తన స్థాయికి మన పోలీసులకు మర్చేలా చట్టాలు చెయ్యలేరా?? ఒక్క రోజులో దేశం మొత్తం నివ్వెరపోయే నిర్ణయం తీసుకున్న మీకు , పోలీసులంటే లైసెన్స్ కలిగిన గూండాలు కాదు, ప్రజలకు రక్షణ కల్పించే బాద్యత గల పౌరులే అని అనిపించేల మార్పులు చెయ్యలేరా?? అలా చేస్తే వాళ్ళు మీ రాజకీయ నాయకుల చేతిలో నుండి జారిపోతారేమో అని భయమా?? ఆ భయం లేనప్పుడు మరి ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించరు?? పోలీసు వ్యవస్థలో మార్పు వస్తే నల్లధనం ఒక ముప్పై శాతం నిరోదించ బడుతుంది. ఎందుకంటే ప్రతీ పోలీసు స్టేషన్ వెనుక నడిచేది అంతా పేపరు మని వ్యవహారమే. నిజాయితీగా వ్యవహరించే పోలీసులను వేళ్ళ మీద లెక్క పెట్టె పరిస్థితి ఉంది నేడు. మరి దీని మీద కూడా దృష్టి పెడితే సామాన్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే జేబులో డబ్బుతో కాకుండా , నన్ను కాపాడేందుకు భాద్యత గల ప్రబుత్వ ఉద్యోగి ఒకడు ఉన్నాడు అన్న ధైర్యంతో వెళ్తాడు. మరి ఈ దిశగా ఏమైనా చర్యలు తీసుకునేది ఉందా??
ఇది నేటి సామాన్యుని ప్రశ్న!
No comments:
Post a Comment