తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గురువారం తెల్లవారుజామున ప్రారంభం కానుంది. ఉదయం 5:22 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దంపతులు గృహ ప్రవేశం చేస్తారు. ప్రస్తుతమున్న రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సిఎం నివాసం, కార్యాలయం, సమావేశం మందిరం... ఈ అయిదు భవనాల సముదాయానికి ‘ప్రగతి భవన్’ గా ప్రభుత్వం నామకరణం చేసింది. ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై వివిధ వర్గాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు, సమాలోచనలు జరిపే మందిరానికి ‘జనహిత’ అనే పేరు ఖరారు చేశారు.
గృహప్రవేశంలో భాగంగా దైవ ప్రవేశం, యతిప్రవేశం, గోవు ప్రవేశం, నివసించేవారి ప్రవేశం శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు, చినజీయర్ స్వామి పాల్గొంటారు.
No comments:
Post a Comment