కర్నాటకలో ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్ అధికారి రవికుమార
ఓ తెలుగమ్మాయితో ప్రేమలో..!
ఓ తెలుగమ్మాయితో ప్రేమలో..!
కర్నాటకలో ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్ అధికారి రవికుమార్ ఓ తెలుగమ్మాయితో ప్రేమలో పడ్డాడని, ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, అయితే ఆమె తిరస్కరించడంతో సూసైడ్‌కు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఆ తెలుగమ్మాయి ఎవరు? దాసరి రోహిణి సింధూరి అనే ఆ అమ్మాయి కూడా ఐఏఎస్ అధికారే!
హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో తన కుటుంబంతో నివసించే ఈమె.. కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసింది. 2009లో ఐఏఎస్ టాపర్‌గా ఎదిగింది. ఆమె 43వ ర్యాంక్ సాధిస్తే.. కర్నాటకలోని తుమ్‌కూర్ జిల్లాకు చెందిన రవి కూడా 2009లోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. అతగాడు 34వ ర్యాంక్ సాధించాడు. ఇద్దరూ మిస్సోరీలోని ఐఏఎస్ ట్రైనింగ్‌లో మొదటిసారి కలుసుకున్నారు. రోహిణిది ఏపీ కావడంతో పొరుగునే వున్న కర్నాటకను ఎంచుకుంది. పరిపాలనాపరంగా ఏమైనా అనుమానాలు వుంటే రోహిణి తరుచూ రవికుమార్ సాయం తీసుకునేదట! ఇద్దరూ ఎంతోసేపు మాట్లాడుకునేవారట!
రోహిణి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుందని అయితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడని సమాచారం. రోహిణి మాండ్య జెడ్పీ సీఈవో అయ్యాక రవికుమార్ బెంగుళూరుకు చెందిన కాంగ్రెస్ నేత హనుమంతరాయప్ప కుమార్తె కుసుమను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు వున్నట్టు వార్తలు వస్తున్నాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో కుసుమ రహస్యంగా మరో అబ్బాయిని పెళ్లి చేసుకుందని, కానీ ఆమె తలిదండ్రులు ఈ విషయాన్ని రవికి చెప్పకుండా అతనితో కుసుమ పెళ్లి జరిపించారని తెలిసింది.
పెళ్లి తర్వాత ఈ విషయాలు తెలుసుకున్న రవి ఎంతో బాధపడ్డాడని, అప్పటినుంచి వాళ్ల వైవాహిక జీవితంలో పొరపొచ్చాలు ఏర్పడ్డాయని తెలిసింది. మరోవైపు తరచూ రోహిణి టచ్‌లో వుండటంతో రవి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని, ఎన్నోసార్లు ఆమె వద్ద పెళ్లిప్రస్తావన తెచ్చాడని తెలుస్తోంది. అయితే అతని ప్రపోజల్‌ను ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. రవి మృతి తర్వాత రోహిణి.. తనను రవి లోగడ వేధించేవాడంటూ ఓ అధికారికి చెప్పడమేమిటని రవి స్నేహితులు అంటున్నారు. అంతగా వేధించేవాడితో.. ఆయన చనిపోయేముందు కూడా 8 ఫోన్ కాల్స్‌లో అరగంటకుపైగా ఎందుకు మాట్లాడిందని కన్నడ పత్రికలు ప్రశ్నిస్తున్నాయి.
సాటి అధికారి అంతగా వేధిస్తుంటే ఆమె అప్పుడే ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ రవి మద్దతుదారులు అంటున్నారు. ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిందా..? చేసి వుంటే ఆ పత్రాలు బెంగుళూరు ఆఫీసుల్లో వున్నాయా అని వెతికే పనిలో పడ్డారు సీఐడీ అధికారులు. అటు – ఈ కేసు గొడవలోంచి బయటపడేందుకు కొన్ని రోజులు సెలవుపై వెళ్లాల్సిందిగా రోహిణి మీద కర్నాటక సర్కార్ ఒత్తిడి తెస్తోందట! ఏమైనా.. అవినీతిని ఎదుర్కొనే సమర్థుడైన అధికారిగా రవికి అక్కడ మంచి పేరుంది.
.............................
ఈ పాట, ఈ సినిమాలో ఇతర పాటలు అన్ని నా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి, మాకు పండిత సన్నిహితం కల్పించి, మా నుండి విస్తరం గా వివరాలు గ్రహించడం వలన లోకం ఇటువంటి దురదృష్ట కర సంఘటనలు జరగ కుండా చోసుకొనగలము. మమ్ములను ఒకచోట వెంటనే కొలువు తీర్చి, మానవజాతి మా నుండి తక్షణం మా దివ్య ప్రభావం ను పొందండి, వివరములు అన్ని వర్గముల వారు నిరంతరం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుశోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment