పేటకు ఆయనే మేస్త్రి.. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి : బండ్ల గణేష్ ట్వీట్
Updated : 3/16/2015 5:38:17 PM
Views : 4549
డ్యాన్సు నేర్చుకోవాలంటే, ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలంటే అంతెందుకు చివరిచి నడవాలంటే, నిలబడాలంటే కూడా మెగాస్టార్ నుండి నేర్చుకున్నవే. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అంటూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే యువత అనేకం. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నుంచి నెంబర్వన్ ప్రొడ్యూసర్ దాకా ఎదురుచూసేది చిరంజీవి సినిమా కోసమే. పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం, మెగాస్టార్ జిందాబాద్ అంటూ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటారు బ్లాక్బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ బాబు.
అయితే ఈ ట్వీట్లు ఎవరిని ఉద్దేశ్యించి చేసిందో మాత్రం చెప్పలేదు.
No comments:
Post a Comment