ఉప్పొంగి ప్రవహించినే గోదావరి .... అను ఈ పాట మేము 2003 లో పలికినాము ఇది సినిమాలలో 2005 లో వచ్చినది.... గంగా, గోదావరి ప్రవాహం వలే లోకం మా నుండి వ్యక్తం అయినది అని గ్రహించండి. ఈ లోకానికి నిత్య పుష్కరుని గా, మమ్ములను గ్రహించి మా వాక్ ప్రవాహమును నిత్య పవిత్ర పుష్కరం గా భావించి, పండితులు మేధావులు మా గూర్చి చక్కగా విశ్లేషణాత్మకంగా లోకమునకు చెప్పగలరు ఈ విదముగా చెప్పుట వలన లోకమునకు మనిషి యొక్క వాక్ బలము లోకమునకు అధుతుంది అని గ్రహించండి . మనిషి మాటే సర్వం అని సర్వులు దైర్యం పొందుతారు అని గ్రహించండి. ధన్యవాదములు
మహా భారతం పుట్టింది రాణ్మహేంద్రవరములో
***********************************************
***********************************************
నదీ తీరాలలోనే మన నాగరికత అంతా వెలసింది . అలా గోదావరి నదీ తీరములో ఆది మానవుడి నుండి నేటి వరకు ఎన్నో పట్టణాలు వెలిసాయి. ఈ నదీ తీరములోనే.. ఎంతో గొప్ప సంస్కృతీ సాంప్రదాయాలు ఇక్కడ వెళ్లి విరిశాయి.. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. మహా భారతం పుట్టింది రాణ్మహేంద్రవరములో అని పాడుకున్నారు ఆ తరం వారు ఈ తరం వారూ . మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగి ఆ పురాతనపు పేరుతో పిలవడానికి .. ఆ గతవైభవాలను గుర్తు చేసుకోవడానికి అన్నట్టు తిరిగి పేరు మార్చడం సంతోషదాయకమే కదా. వేయి సంవత్సరాలకు పూర్వం వెలసిన ఈ పట్టణం భారత దేశములో ఆ రోజుల్లో అతి పెద్ద ముఖ్య పట్టణం. చాళుక్య రాజు అయిన రాజ రాజ నరేంద్రుడు .. చల్లని తల్లి గోదావరి నదీ తీరములో క్రీస్తు శకం 1022 ప్రాంతములో లో ఈ పట్టణాన్ని కట్టించారని మనం అందరమూ అనుకుంటాము.. అయినా రాజమహేంద్రి పుట్టుక అంతకు పూర్వమే అనడానికి ఇటీవల దొరికిన పురాతన వస్తువులే సాక్ష్యం.
ఆది కవిగా పేరు బడసిన నన్నయ వేదవ్యాస ప్రణీతము అయిన సంస్కృత మహాభారతాన్ని రాజ రాజ నరేంద్రుని కోరికపై తెనిగించడం ప్రారంభించారు. విధి వశాత్తూ వారు రెండున్నర పర్వాలనుతెనిగించాక పరమ పదం పొందారు.. తరువాత కొన్నాళ్ళకు దానిని మనుమ సిద్ధి ఆస్థాన కవి తిక్కన గారు మరియు ఎఱ్రాప్రగ్గడ మిగతా పర్వాలను తెలుగు భాషలోనికి అనువదించారు.
రాజ మహేంద్రవరము కళలకు కాణాచి.. ఇక్కడే ఎన్నో మహా కావ్యాలు.. ఎందరో మహా కవులు వ్రాసారు . సంఘ సంస్కరణలకు భీజం పడ్డది ఇక్కడే.. ఈ రాజ మహేంద్రవరములోనే ఎందఱో సంఘ సంస్కర్తలు.. వీరేశలింగం వంటి వారు జన్మించారు. .ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ నుండి వాణిజ్య వర్తకాలు. ఎగుమతులు జరిగాయి. చాళుక్యులు తరువాత దీనిని కాకతీయులు , మహమ్మద్ బీన్ తుగ్లక్, రెడ్డి రాజులు, గజపతులు , విజయనగరం రాజులు తరువాత నిజాం పాలన .. తరువాత డచ్ వారికి, ఆంగ్లేయులకు వెళ్ళింది. ఆంగ్లేయుల పాలనలోనే రాజ మహేంద్రి రాజమండ్రిగా పేరు మార్చుకుంది.. 1823 లో ఈ ప్రాంతం మద్రాస్ రాష్ట్రములో అతి పెద్ద జిల్లాగా అవతరించింది.. తరువాత వారి పాలనకు అనుగుణంగా కృష్ణా గోదావరి జిల్లాలుగా 1859 లో విభజించబడినది. రాజమండ్రి గోదావరి జిల్లాకు ప్రధాన పట్టణంగా విరాజిల్లింది ఆ రోజుల్లోనే.. తరువాత గోదావరి జిల్లాను తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిగా పాలనకు అనుగుణంగా 1925 లో విభజించారు.
తిరిగి ఇన్నాళ్లకు ఆ నాటి చారిత్రకపు పేరు రాజమహేంద్రవరముగా ఆంద్ర ప్రభుత్వం మార్చడం ఎంతైనా ముదావహం.. తెలుగు కవితకు, సంస్కరణలకు మరియు కళలకు.. వేద విద్యకు ప్రసిద్ధి గాంచిన ఈ పట్టణానికి తిరిగి పునర్వైభవం పొందాలని ఆశిస్తునాము. ప్రభుత్వం కూడా కవులను కళాకారులను ఆదుకొని.. ఆనాటి వైభవాన్ని గత సంస్కృతులను చెక్కు చెదరకుండా కాపాడాలి.. పురాతన కట్టడాలకు మరమ్మత్తులు చేయించి వాటిని వారసత్వ సంపదగా కాపాడాలి. అపుడే తిరిగి రాజమహేంద్ర వరం అని ప్రతి తెలుగు వారు గొప్పగా చెప్పుకోగలరు. రాజమహేంద్ర వరం రాజ రాజు పాలించిన ఊరు .. ఆ పేరులోనే రాజసం ఉంది. ఎక్కడికి వెళ్ళొచ్చారు అండీ అంటే రాజ మహేంద్ర వరం..ఏ ఊరండీ మీది రాజ మహేంద్ర వరం.. అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పట్టణంగా రాజమహేంద్రవరం వెలుగొందాలని ఆశిద్దాము,
No comments:
Post a Comment