నిన్న సాయంత్రం రాజమండ్ర్రిలోని ఆర్ట్స్ కాలేజ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి వెళ్లాను...
మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ గారి ప్రదర్శన చాలా బాగుంది,,కానీ ఎక్కువసేపు చూడలేకపోయానే అని కాస్త నిరాశ చెందుతూంటే ఆ లోటుని భర్తీ చెయ్యడానికన్నట్లు ఆ తర్వాత దాదాపు 1200 మంది అమ్మాయిలు సాంప్రదాయ వస్త్రధారణలో కూచిపూడి నృత్యం చేశారు,,అయ్యబాబోయ్ ...!!!
వారి ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందంటే ఆ 18 నిమిషాలు నాకు అమరత్వం వచ్చేసిందేమో అనిపించింది.(దేవతలను " అనిమిషులు " అని అంటారు..అంటే " కనురెప్పలు వెయ్యని వారు " అని అర్ధం....ఈ అమ్మాయిల ప్రదర్శన జరిగిన ఆ 18 నిమిషాలు నేనూ కనురెప్ప వెయ్యడం మరిచాను కాబట్టి నాకూ అమరత్వపు లక్ష్ణాలు అబ్బినట్లేగా? అందుకనే అమరత్వం పొందిన అనుభూతి కలిగింది ఆ సమయంలో అని రాశాను...మరి దీనిని ఏ రకపు వర్ణన అంటారో నాకైతే ఏమీ తెలియదు కానీ అతిశయోక్తి అలంకారం మాత్రం కాదు)...
ఒక్కో అమ్మాయీ ఒక్కో గోదాదేవిలా అనిపించింది నాకైతే.మొత్తమీద వారి ప్రదర్శన చూశాక ఆముక్తమాల్యద చదివినంత ఆనందం కలిగింది...
ఇక ఇంతకి మించి ఏం రాయమంటారు చెప్పండి?
శుభసాయంత్రం smile emoticon
- Kks Kiran
No comments:
Post a Comment