// మీడియా స్వేచ్చ పేరుతో బరితెగిస్తున్న మీడియా పైనా నిఘా ఉండితీరాలి //
.
>> మేమున్నదే ఈ సమాజాన్ని శుద్ధి చేయడానికన్నట్లు కలరింగ్ ఇస్తూ, అడ్డమైన గడ్డీ కరస్తున్న ఈ సిగ్గుమాలిన మీడియా, సామాజిక బాధ్యతలకు ఎన్నడో మంగళం పాడిన ఈ మీడియా, ఇంకా తనను తాను పరమ పావనం అని భావించడం వింతల్లోకెల్ల వింత..
>> పొద్దున్న లేస్తే, ఏదో ఒక సెన్సేషన్ ఉంటే తప్ప పూట గడపడానికి బుద్ధి పుట్టని ఈ మతిలేని మీడియాకు మితిమీరిన స్వేచ్చనివ్వడం ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం
>> అంటే "మీడియా స్వేచ్చకు భంగం" అంటూ ఇంతెత్తున లేస్తారు గానీ, ఈ మీడియా వాళ్ళెప్పుడైనా "వ్యక్తుల స్వేచ్చ" కు ఏమాత్రమైనా విలువనిస్తున్నారా ???? స్వేచ్చ అన్నది వీరొక్కరి సొత్తా ??? మీడియాను ఎవ్వరూ విమర్శించకూడడా ????

... ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికార కిరీటంతో నానా చండాలపు పనులు చేస్తూ, నీతిమాలిన రాజకీయులను నెత్తిమీద మోస్తూ, జర్నలిజాన్ని రాజకీయ వ్యాపారంగా మార్చివేసిన ఈ మీడియాకున్న విలువ ఏపాటిది ????
... కాబట్టి, "రాజకీయ పార్టీలను ఆర్టిఐ పరిధిలో తేవాలనడం" ఎంత న్యాయమైన డిమాండో, ఈ "మీడియా సంస్థలను కూడా ఆర్టిఐ పరిధిలో తేవడం" కూడా అంతే న్యాయమైన డిమాండ్"..!!!
.... అడ్డూ అదుపూ లేకుండా బరితెగించిన ఈ మీడియాకు జవాబుదారీతనాన్ని నేర్పితీరాల్సిందే..!! లేకపోతే వీరి పోకడలు సమాజానికి వినాశకర హేతువులుగా తయారవుతాయి..!!
!! మీడియా ను ఆర్టిఐ చట్ట పరిధిలోనికి ఖచ్చితంగా తేవాల్సిందే.. !!
No comments:
Post a Comment